Breaking Newsతెలంగాణ

Indiramma Indlu : ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త.. నేడు శంకుస్థాపన..!

Indiramma Indlu : ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త.. నేడు శంకుస్థాపన..!

తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇల్లు నిర్మించేందుకుగాను ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2025 జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాగా ఈ పథకం లబ్ధిదారులకు మరో శుభవార్త తెలియజేసింది.

శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ జిల్లాలు మినహా మిగతా మూడు జిల్లాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. 72,045 ఇందిరమ్మ ఇండ్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనున్నది.

MOST READ : 

  1. Power Shock : కాటేసిన కరెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత..!

  2. GPay : గూగుల్ పే కొత్త ఫీచర్.. ఇక డిజిటల్ చెల్లింపులు చాలా ఈజీ..!

  3. GPay : గూగుల్ పే కొత్త ఫీచర్.. ఇక డిజిటల్ చెల్లింపులు చాలా ఈజీ..!

  4. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. వారికోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు..!

మరిన్ని వార్తలు