Power Shock : కాటేసిన కరెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత..!
Power Shock : కాటేసిన కరెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత..!
* పొలంలోనే ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబం
* పందుల బెడద నివారణకు విద్యుత్ తీగల ఏర్పాటు
* మోటారు వేస్తుండగా కరెంట్ షాక్
* ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత
* ఒకరిని రక్షించబోయి మరొకరు మృతి
* నిజామాబాద్ జిల్లాలో విషాదం
నిజామాబాద్, మన సాక్షి :
భూ మాతను నమ్ముకుని సేద్యం చేసే ఓ రైతు కుటుంబం కరెంట్ షాక్ కు బలైంది. గురువారం ఉదయం నిజామా బాద్ జిల్లా పెగడపల్లి గ్రామ శివారు పంట పొలాల్లో జరిగిన సంఘటన వివ రాలు ఇలా ఉన్నాయి.
రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన దంపతులు గంగారం (45), బాలామణి (40) లతో పాటు వారి కుమారుడు కిషన్ (22) లు వారి పొలానికి నీరు పడుతుం డగా బోరు మోటార్ వద్ద కరెంట్ షాక్ తగిలింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తమ పంట పొలంలోనే ప్రాణాలు కోల్పోయిన సంఘటనతో నిజామాబాద్ జిల్లాలో విషాదఛాయలు అలు ముకున్నాయి.
ఒకరిని రక్షించబోయి మరొకరు :
పొలంలో నీరు పట్టడదానికి గంగారం మోటారు వేశారు. షాక్కు గురైన గంగారం గిలగిల కొట్టుకోవడం చూసి రక్షించడానికి వెళ్లిన ఆయన భార్య బాలామణి కూడా షాక్కు గురయ్యారు. కొంచెం దూరంలో ఉన్న కుమారుడు కిష న్ పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులను కాపాడేందుకు ఇద్దరిని లాగబోయాడు. వెంటనే కొడుకు కూడా షాక్ కు గురికాగా ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
పందుల బెడద నివారణకు విద్యుత్ వైర్ల ఏర్పాటు :
పంటలను నాశనం చేస్తున్న పందుల బెడద నుంచి రక్షణ కోసం కింద విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. ఇది గమనించక పోవడంతో గంగరాంతోపాటు కుటుంబ సభ్యులు విద్యుత్ షాక్ కు గురై మృత్యు వాత పడ్డారు.
ఈ విషయం తెలియ డంతో సాటపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమా చారం అందుకున్న బోధన్ ఏసీపీ శ్రీని వాస్, రూరల్ సీఐ విజయబాబు సంఘ టన స్థలానికి చేరుకున్నారు. కేసు పంచ నామా చేసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
MOST READ :
- Suryapet : వారాబంది వట్టి మాటలేనా.. ఎండుతున్న పంటలు కాపాడుకునేందుకు రోడ్డెక్కిన రైతులు..!
-
UPI : తప్పు నెంబర్ కు యూపీఐ డబ్బులు పంపించారా.. అయితే ఇలా చేయండి..!
-
GPay : గూగుల్ పే కొత్త ఫీచర్.. ఇక డిజిటల్ చెల్లింపులు చాలా ఈజీ..!
-
Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. వారికోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు..!
-
Smart Ration Cards : ATM సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. మహిళల పేరుతోనే ఆ జిల్లాల్లో పంపిణీ..!









