Good News : షెడ్యూల్ తెగలకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం చేయూత..!
Good News : షెడ్యూల్ తెగలకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం చేయూత..!
నలగొండ, మన సాక్షి :
షెడ్యూల్డ్ తెగల వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. బడ్జెట్లో కేటాయించిన నిధులతో చేతను అందించేందుకు సిద్ధమైంది.
వివిధ పథకాల కింద షెడ్యూల్డ్ తెగల లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో 350 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తెలిపారు.
సోమవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలో షెడ్యూల్ తెగల అభివృద్ధికై జిల్లాలో అమలు చేస్తున్న పథకాలపై గిరిజన సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారుఅనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ తెగల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ,ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో గిరిజనల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, వారికి కల్పించాల్సిన సౌకర్యాల పై చర్చించే నిమిత్తం జిల్లాకు వచ్చినట్లు తెలిపారు.
ఇదివరకే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలలో పర్యటించడమే కాకుండా ఐటీడీఏలలోసమావేశాలు సైతం ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని ,ఈనెల 30న హైదరాబాదులో రాష్ట్రస్థాయిలో గిరిజన సంఘాల నాయకులతో చర్చించి వారి ఆభిప్రాయాన్ని తీసుకొనున్నామని, 31న గిరిజన ప్రజాప్రతినిధులతో సమీక్షించనున్నమని , సెప్టెంబర్ 4న కొత్త బడ్జెట్లో కేటాయించిన 350 కోట్ల రూపాయల నిధుల ప్రకారం ఎలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
అక్టోబర్ లో ఆర్థిక చేయూత, చిన్న మధ్య తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహ పథకం, భూమి అభివృద్ధి పథకాల కింద లబ్ధిదారుల ఎంపికై నోటిఫికేషన్ జారీ చేస్తామని, మహిళలు, నిరుద్యోగ యువతీ యువకులు, చదువుకున్న వారికి ఈ పథకాల కింద లబ్ధి చేకూర్చున్నట్లు ఆయన వెల్లడించారు.
నెలలోపు ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి నవంబర్లో వారికి ఆర్థిక సహాయం అందించనున్నట్లుతెలిపారు. ఇందుకుగాను యుద్ధప్రతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయం లో గిరిజనుల అభివృద్ధికి రూపాయి కేటాయించలేదని అన్నారు. గత ప్రభుత్వం ట్రైకార్ కింద ఎంపిక చేసిన లగ్ధిదారులకు సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం 426 కోట్లు మంజూరు చేయడమే కాకుండా, 410 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు.
గతంలో పెండింగ్లో ఉన్న యూనిట్లన్నింటిని మంజూరు చేస్తామని, అలాగే కొత్త బడ్జెట్ ప్రకారం ప్రతిపాదనలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గిరిజనులకు పోడు భూములపై ఆయన మాట్లాడుతూ చట్టప్రకారం దున్నుకొంటున్నవారికి భూములు ఇస్తామని, గతంలో ఇందిరాగాంధీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ఇవ్వడం జరిగిందని, వాటన్నింటికీ పూర్తిస్థాయి పట్టాలు, హక్కులు కల్పించాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఆయన వెల్లడించారుజిల్లా గిరిజన సంక్షేమ ఇంచార్జ్ అధికారి, హోసింగ్ పి డి రాజ్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, ఆర్డిఓ రవి, డిఎస్పి శివరాం రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.
LATEST UPDATE :
తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!
Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!









