Breaking News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి ఎకౌంట్ల లోకి పదివేల రూపాయలు..!

తెలంగాణలో రైతులకు ప్రభుత్వ శుభవార్త తెలియజేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తుంది. అధికారం చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల అమలకు చర్యలు చేపట్టారు.

Breaking News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి ఎకౌంట్ల లోకి పదివేల రూపాయలు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులకు ప్రభుత్వ శుభవార్త తెలియజేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తుంది. అధికారం చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల అమలకు చర్యలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలలో ఐదు గ్యారెంటీ హామీలను అమలు చేస్తున్నారు.

రైతులకు రైతుబంధు ద్వారా ఈ నెల 9వ తేదీలోగా ప్రతి ఒక్క రైతుకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో బోర్లు ఎండిపోయి పంటలు ఎండిపోయాయి దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

వంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు రైతులకు పంట నష్టపరిహారంగా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున నష్ట పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి సోమవారం జీవో జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15,81,014 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15,814 ఎకరాలలో పంట నష్టం కలిగింది.

కాగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల పరిశీలన చేయగా 15,246 మంది రైతులకు నష్టం వాటిలినట్లు గుర్తించారు. రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేయమన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో పదివేల ఎకరాల పంట నష్టం వ్యవసాయ అధికారులు గుర్తించారు. ఎన్నికల కమిషన్ అనుమతితో పంట నష్టం నిధులను విడుదల చేస్తూ జీవో జారీ చేశారు.

గత ప్రభుత్వంలో పంట నష్టం కోసం ఎదురుచూసిన

రైతులు :

గత ప్రభుత్వ హయాంలో వర్షాలు పడి పంటలు తీవ్రంగా నష్టపోయారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తామని హామీలు ఇచ్చారు. అధికారులు సమీక్షలు నిర్వహించి ఉన్నత స్థాయి అధికారులకు నివేదికలు అందజేశారు. అయినా కూడా ప్రభుత్వం ఒక రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. చాలామంది రైతులు పంటలు నష్టపోయి కష్టాలొకి పోయారు. ప్రభుత్వం అందజేసే నష్టపరిహారం కొంతమేరకైనా ఆదుకుంటుందని ఎదురుచూసిన ఉపయోగం లేకుండా పోయింది.

రైతులను ఆదుకుంటున్న రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి కేవలం ఐదు మాసాలే అయింది. అయినా కూడా రైతులను ఆదుకోవడానికి ఆయన ముందుకు వచ్చారు. పంటలు ఎండిపోయి నష్టం వాటిల్లిన రైతులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే నిధులు విడుదల చేశారు. దాంతో రైతుల్లో ఆనందం వెళ్లి విరుస్తుంది. నష్టపోయిన రైతుల జాబితా ఆధారంగా వారి వారి ఎకౌంట్లోకి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున జమ కానున్నాయి.