TG News : తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగ సంఘాలు హ్యాపీ..!

TG News : తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగ సంఘాలు హ్యాపీ..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలియజేసింది. దాంతో ఉద్యోగ సంఘాలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రాష్ట్రంలో రెవిన్యూ శాఖను బలోపేతం చేయడానికి మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయానికి ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామానికి ఒక క్షేత్రస్థాయి అధికారి ఉండేలా మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కొత్తగా ఏర్పడిన డివిజన్లు, మండలాలకు సైతం ఉద్యోగాలను మంజూరు చేసింది. వాటితో పాటు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో 10,950 గ్రామాలకు క్షేత్రస్థాయి అధికారుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు కొత్త డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మంజూరు, 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు సైతం క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
దాంతో ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ఇతర మంత్రులకు, సీసీఎల్ఏ నవీన్ మెటల్ కు ఉద్యోగ సంఘాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
MOST READ :
-
District collector : ఇందిరమ్మ ఇండ్లు మొదటి ప్రాధాన్యత వారికే.. జిల్లా కలెక్టర్ స్పష్టం..!
-
Cm Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీచర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన శ్రీపాల్ రెడ్డి.. ఎందుకంటే..!
-
Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!









