Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : తెలంగాణ సర్కారు శుభవార్త.. వారికి వన్ టైం సెటిల్మెంట్, అసలు వదులుకోవద్దు..!

Hyderabad : తెలంగాణ సర్కారు శుభవార్త.. వారికి వన్ టైం సెటిల్మెంట్, అసలు వదులుకోవద్దు..!

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్తను అందించింది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. నిత్యం బిజీ షెడ్యూల్ తో గడిపే హైదరాబాద్ నగరవాసులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బిల్లుల విషయంలో ఆలస్యం అయిపోతుంటారు.

ఇంట్లో నుంచి వెళ్లడం.. ఆఫీస్ కార్యక్రమాలు, పనులు చక్కబెట్టుకుని ఇంటికి వచ్చే వరకే ట్రాఫిక్ సమస్యలు, ఇతర సమస్యలతో నగరవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు.  కొన్ని రకాల బిల్లులు చెల్లింపు విషయంలో ఆలస్యం అవుతుంటుంది. దానివల్ల బిల్లులు పెండింగ్ ఉంటాయి.

వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త తెలియజేసింది. వన్ టైం సెటిల్మెంట్ కు అవకాశం ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో పెండింగ్ నల్ల బిల్లులు చెల్లించేలా ఈ వన్ టైం సెటిల్మెంట్ అందుబాటులో ఉంచింది. వీరికి వన్ టైం సెటిల్మెంట్ లో లేట్ ఫీజు, వడ్డీ ఉండదు. కేవలం బిల్లు కడితే సరిపోతుంది.

దానివల్ల ప్రజలకు కూడా భారం తగ్గినట్లు అవుతుంది. ఈనెల 31వ తేదీలోగా ఈ అవకాశం కల్పించింది. ఈనెల 31వ తేదీ వరకు నల్ల బిల్లులను మెట్రో వాటర్ బోర్డుకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని నగర ప్రజలు అసలు వదులుకోవద్దని అధికారులు కోరుతున్నారు.

ఈ ఆఫర్ ఇళ్లలో వారికి, ఇళ్లలో ఉండని వారికి , వ్యాపారులకు, పరిశ్రమలకు ,వాణిజ్య సంస్థలకు, బల్క్ ఎంఎస్పీ కేటగిరి కనెక్షన్లకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు, ఈ వన్ టైం సెటిల్మెంట్ వర్తించనున్నది. అయితే ఎప్పుడైనా లేట్ బిల్లులు చెల్లించిన వారికి వడ్డీ కానీ ఆలస్య ఫీజు కానీ చెల్లించాల్సి ఉంటుంది.

ఇలాంటి వన్ టైం సెటిల్మెంట్ సమయంలో ఎలాంటి అదనంగా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.కేవలం బిల్లు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. వన్ టైం సెటిల్మెంట్ సమయంలో పెండింగ్ బిల్లులు చెల్లించుకోలేక పోయినవారికి ఆ తర్వాత అదుపు బిల్లులు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు