TOP STORIESBreaking News

Gold Price : తెలుగింటి మహిళలకు శుభవార్త.. రూ.4900 తగ్గిన బంగారం ధర..!

Gold Price : తెలుగింటి మహిళలకు శుభవార్త.. రూ.4900 తగ్గిన బంగారం ధర..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

బంగారం ప్రియులకు శుభవార్త అందింది. గత పది రోజులుగా బంగారం ధర రోజుకు ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. కానీ (అక్టోబర్ 28) సోమవారం బంగారం ధర తగ్గింది. తెలుగింటి మహిళలకు, బంగారం ప్రియులకు బంగారం ధర తగ్గడంతో శుభవార్త అందింది. కార్తీక మాసం ప్రారంభానికి ముందే బంగారం ధర పెరగడంతో కొనుగోలుదారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు.

మరో నెల రోజుల వ్యవధిలో పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరువవుతుందని అంచనాలు ఉన్నాయి. కాగా సోమవారం మాత్రం బంగారం ధర తగ్గింది. హైదరాబాదులో బంగారం ధర వివరాల ప్రకారం.. 24 క్యారెట్స్ బంగారం ధర 100 గ్రాములకు 4900 తగ్గింది. 22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు 4500 తగ్గింది.

సోమవారం హైదరాబాదులో బంగారం ధర వివరాలు 

24 క్యారెట్స్ బంగారం ధర

ఒక గ్రాము అక్టోబర్ 27వ తేదీన 8029 ఉండగా అక్టోబర్ 28వ తేదీన 49 రూపాయలు తగ్గి 7980 ఉంది. 8 గ్రాముల బంగారం ధర రూ.392 తగ్గి ఈరోజు 63,840 రూపాయలు, 10 గ్రాముల బంగారం ధర 490 రూపాయలు తగ్గి 79,800 లకు చేరింది. 100 గ్రాముల బంగారం ధర రూ.4900 తగ్గి 7,98,000 చేరింది.

22 క్యారెట్స్ బంగారం ధర

ఈరోజు 45 రూపాయలు తగ్గి 7315 కు చేరింది. 8 గ్రాముల ధర 360 రూపాయలు తగ్గి 58,520 చేరింది. 10 గ్రాముల ధర 450 రూపాయలు తగ్గి 73,150 కి తగ్గింది. 100 గ్రాముల బంగారం ధర 4500 తగ్గి 7,31,500 రూపాయలకు చేరింది.

MOST READ : 

మరిన్ని వార్తలు