Breaking Newstravelజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Railway : శంకర్‌పల్లి ప్రజలకు శుభవార్త.. రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలుపుదల..!

Railway : శంకర్‌పల్లి ప్రజలకు శుభవార్త.. రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలుపుదల..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ కు రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు రానున్నాయి. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా రాయచూర్- పర్భని ఎక్స్ ప్రెస్, హైదరాబాద్ – విజయపుర ఎక్స్ ప్రెస్ రెండు ట్రైన్ల నిలుపుదలకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి అంగీకరించారు. పార్లమెంటు సమావేశాల తర్వాత చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి హాజరై రెండు రైళ్లకు జెండా ఊపి ప్రారంభిస్తారని స్థానిక బిజెపి నాయకులు తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు పట్టణ, మండల, ప్రయాణికులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.









