Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్

Rythu : కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు రుణం..!

Rythu : కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు రుణం..!

మన సాక్షి :

కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. వారికి కూడా లక్ష రూపాయల వరకు రుణం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా చర్యలను చేపట్టింది. ఈ మేరకు కొన్ని జిల్లాలలో అధికారులు కౌలు రైతుల జాబితాలను కూడా యుద్ధం చేశారు.

రైతులు వ్యక్తిగతంగా గాని సంఘాలుగా కానీ ఏర్పడి రుణాలను పొందవచ్చును. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఈ రుణాలను అందించనున్నారు. దానికి అర్హతలను ఎలా నిర్ణయిస్తారు. ఎవరికి అందజేస్తారనే విషయం తెలుసుకుందాం…

కౌలు రైతులు లక్ష రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంది. తప్పనిసరిగా సంబంధిత అధికారులు జారీచేసిన కౌలు పత్రాలు కలిగి ఉండాల్సి అవసరం ఉంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో నివాసం ఉండాలి. సంఘంలో సభ్యులై ఉండాలి. సొంత ఇల్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. కౌలు పత్రంలో సాగు చేసే భూమి ఎకరం కంటే తక్కువ ఉండకూడదు. మనం తీసుకున్న రోజు నుంచి ఏడాదిలోపు అసలు వడ్డీతో కలిపి రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.

అసైన్డ్ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు ఈ రుణం రాదు. అదే విధంగా ఎకరం కంటే తక్కువ ఉన్న్ కూడా రుణం రాదు. సహకార సంఘం పరిధిలో నివాసం లేకుండా అందజేయరు. మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలు రానున్నాయి.

MOST VIEWS 

  1. సోనియా గాంధీకి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్.. అందజేసిన సీ ఎం రేవంత్..!

  2. TET : తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్ష తేదీలు ఇవే..!

  3. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

  4. SBI : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. కొత్తగా 6,500 ఉద్యోగాలు..!

మరిన్ని వార్తలు