Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, మీరు దరఖాస్తు చేసుకోండి..!
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, మీరు దరఖాస్తు చేసుకోండి..!
మన సాక్షి :
కేంద్ర ప్రభుత్వం.. రైల్వే శాఖ నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. సెంట్రల్ రైల్వేలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ 2,424 ఖాళీల భర్తీకి మంగళవారం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆగస్టు 15వ తేదీ లోగా అధికారిక వెబ్సైట్ ఆర్ఆర్ సిసిఆర్ డాట్ కామ్ rrccr.com లో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నది.
పదవ తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చును. అదనంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ కానీ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ ద్వారా కానీ గుర్తింపు పొందిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కూడా అందజేయాల్సి ఉంటుంది.
15 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చును. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబిసి కి మూడు సంవత్సరాల సడలింపు ఇస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
అభ్యర్థులు ఐటిఐ, మ్యాథ్స్ లో సాధించిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్టును తయారు చేయనున్నారు. షార్ట్ లిస్టుకు ఎంపికైన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. మరింత సమాచారం కోసం సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేసి తెలుసుకోవచ్చును.
ఇవి కూడా చదవండి :
తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు, భారీగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఆయకట్టు రైతుల ఆశలు పదిలం..!
Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వారికి రూ.5 లక్షలు సహాయం..!









