నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న 2280 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతి లో నియమించనున్నారు. అందుకుగాను ప్రభుత్వం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమైనందున అర్హులైన అభ్యర్థులను కాంట్రాక్టు, పార్ట్ టైం, గెస్ట్ అద్యాపకులుగా ఎంపిక చేయనున్నారు.
జూనియర్ కళాశాలలో.. 1654 మంది గెస్ట్ లెక్చరర్లు, 449 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 96 మంది పార్ట్ టైం, 78 మంది ఔట్సోర్సింగ్, ముగ్గురు మినిమం టైం స్కేల్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వీరిని 2025 మార్చి 31వ తేదీ వరకు బోధించేందుకు నియామకాలు చేపట్టనున్నారు. అందుకుగాను త్వరలో నియామక ప్రక్రియ ప్రారంభం కానున్నది.
LATEST UPDATE :
District SP : పగలు, రాత్రి 24/7 పెట్రొలింగ్.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశం..!
Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!
Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!
Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!









