Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత ఉపాధి, నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.. శిక్షణ కాలంలో భృతి..!
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత ఉపాధి, నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.. శిక్షణ కాలంలో భృతి..!
జగిత్యాల జిల్లా ప్రతినిధి, (మన సాక్షి)
బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జగిత్యాల జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయిబాబా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వెబ్ సైట్ tgbestudycircle.cgg.gov.in లో
ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
హైద రాబాదులోని కుషాయిగూడలో ఎలీ హోప్ టెక్నికల్ స్కిల్స్ అకా డమీ ఆధ్వర్యంలో 100 మంది అభ్యర్థులకు 90 రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలం పూర్త యిన తర్వాత అకాడమీ వారే ఉద్యోగాలు కల్పిస్తారని తెలిపారు.
శిక్షణ కాలంలో ఒక్కో అభ్యర్థికి నెలకు రూ.4 వేల చొప్పున భృతిని సంస్థ అందిస్తుందన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన 18 నుంచి 25 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 0878-2268686 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.
LATEST UPDATE :
Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!
Panchayathi Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల..!
Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!
Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!









