TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుమెదక్

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!

అందోలు, మనసాక్షి :

ఉపాద్యాయుల సహాకారంతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సీ. దామోదర రాజనర్సింహా అన్నారు.  సంగారెడ్డి జిల్లా అందోలు మండలం సంగుపేట వద్ద గల ఓ ఫంక్షణ్‌హాలులో ఆందోల్‌ నియోజక వర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధానోత్సవం లో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

ఉపాధ్యాయులు మంత్రిని షాలువాతో సన్మానించి చిరు జ్ఞాపికను అందజేశారు. అనంతరం మంత్రి సర్వేపల్లి రాధాకష్ణన్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సభ వేదికపై పాఠశాల విద్యార్థినిలు చేసిన నత్యాలు పలువుని ఆకర్షించాయి. భరతనాట్యం చేసిన విద్యార్థిని మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. అనంతరం 128 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంస పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేసి శాలువాలతో సత్కరించారు.

ALSO READBIG BREAKING : కేజ్రీవాల్ కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు..!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందన్నారు.ఇప్పటివరకు 40వేల ఉద్యోగాలు, 35వేల మందికి ప్రమోషన్లను ప్రభుత్వం కల్పించిందన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రేస్‌ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల అభివద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచి బోధన అందించటమే కాకుండా అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉందన్నారు.

దేశ , సమాజ నిర్మాణం ఉపాధ్యాయుల పైన ఉందన్నారు. విలువలతో కూడుకున్న జీవితం ఉపాధ్యయులదనీ వెల్లడించారు. అందోలు నియోజక వర్గాన్ని ఎడ్యుకేషనల్‌ హబ్‌ తీర్చిదిద్ధామన్నారు .నిబద్ధత కలిగిన చరిత్ర ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మెగా డిఎస్సీ ద్వారా 58 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు.

త్వరలో 6వేల ఉద్యోగాల భర్తీ :

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ ను తెచ్చామన్నారు. త్వరలో డిఎస్సీ ద్వారా 6 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయబోతున్నామన్నారు ఉపాధ్యాలందరికి హెల్త్‌ కార్డుల జారీకి కమీటి వేస్తామన్నారు.సిఎస్‌ఆర్‌ నిధుల ద్వారా ప్రతి పాఠశాల లో మౌలిక వసతుల కల్పనకు, అభివద్ధికి కషి చేస్తామన్నారు.

ఉప ముఖ్యమంత్రి గా, విద్యా శాఖ మంత్రి గా అందోల్‌ నియోజక వర్గంలో ప్రతిష్టాత్మకమైన జెఎన్‌టీయూ , మూడు పాలిటెక్నిక్‌ కళాశాలలను తెచ్చామన్నారు. ఇప్పుడు నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రూ.50 కోట్ల రూపాయలతో ఆధునిక ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అలాగే, మెడికల్‌ కాలేజీ ల కోసం గత పాలకులు జిఓలు ఇచ్చి రాజకీయంగా వాడుకున్నారన్నారు. జిఓలు ఇస్తే మెడికల్‌ కాలేజ్‌ లు వస్తాయా అని మంత్రి దామోదర్‌æ ప్రశ్నించారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెడికల్‌ కాలేజ్‌ లలో ఇన్‌ప్రాస్ట్రక్చర్, ఎక్వాయిప్‌మెంట్, హెచ్‌ఆర్‌లను కెటాయించి ఎన్‌ఎంసీ నార్మ్స్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పంపి 8 మెడికల్‌ కాలేజ్‌ లకు అనుమతులు సాధించామన్నారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగుల 5 డిఏలుlపెండింగ్‌ ఉన్నాయని అందులో కనీసం 3 డిఏలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుకుంటున్న విషయం సీఎం దృష్టిలో ఉందన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి పేదవాడి ఆరోగ్యానికి భద్రత కల్పించేందుకు కుటుంబంలోని ప్రతి వ్యక్తికి హెల్త్‌ కార్డులు అందజేసేందుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, పిఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్, రాష్ట్ర అసోసియేట్‌ అద్యక్షుడు ఆకుల మాణయ్య, జిహెచ్‌ఎం అధ్యక్షులు సుబ్బారావు, నిర్మాణ కమిటీ సభ్యులు అందోలు మండల విద్యాధికారి బండి కృష్ణ, నరోత్తమ్‌ కుమార్, రాజమల్లు, మహేష్‌ చారి, అల్లె మహేందర్, జనార్ధన్‌ గౌడ్, అనిల్‌ కుమార్, మంజ్యా నాయక్, సుభాష్, అనిల్‌ కుమార్, 9 మండలాల విధ్యాధికారులు పాల్గోన్నారు.

LATEST UPDATE : 

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!

Rythu Barosa : రైతులకు శుభవార్త, రైతు భరోసాపై క్లారిటీ.. వారికి మాత్రమే, మంత్రి తుమ్మల కీలక ప్రకటన..!

TG News : తెలంగాణలో రెండో రోజు రాజకీయ రచ్చ.. నేతల మధ్య మాటల యుద్ధం..!

మరిన్ని వార్తలు