TOP STORIESBreaking Newsవ్యవసాయం

Runamafi : రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్.. వారికి కూడా రుణమాఫీ..!

Runamafi : రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్.. వారికి కూడా రుణమాఫీ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ కార్యక్రమం కొనసాగుతుంది. ఆగస్టు 15వ తేదీ లోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మూడు విడతలుగా రుణమాఫీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రూపాయలను మాఫీ చేశారు. వివిధ కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతులకు మరోసారి నిధులు విడుదల చేసి రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి కుటుంబ నిర్ధారణ సర్వే పూర్తి చేశారు. సుమారు నాలుగు లక్షల మంది రైతులకు పైగా కుటుంబ నిర్ధారణ పూర్తి కావడంతో మరో రెండు మూడు రోజుల్లో వారికి 5000 కోట్ల రూపాయలను విడుదల చేసి రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఇదిలా ఉండగా రేషన్ కార్డులు లేని రైతులు కూడా సుమారు 1,20,000 మంది అధికారులకు ఫిర్యాదులు అందజేశారు. మరి కొంతమంది రైతులు రేషన్ కార్డులు లేవని వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించలేదు. దాంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేషన్ కార్డులు లేని రైతులకు కూడా త్వరలో రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తామని మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. కాగా తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంపై మరోసారి స్పష్టం చేశారు.

రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదని ఇంకా కొనసాగుతుందని రైతులెవరు ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందుతుందని చెప్పారు. ప్రతిపక్షాలు రుణమాఫీ విషయంలో రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉంచిన రైతుబంధు బకాయిలను కూడా 7656 కోట్ల రూపాయలు అందజేశామని చెప్పారు.

ఇప్పటివరకు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో 18 వేల కోట్ల రూపాయలు జమ చేశామని, రెండు లక్షలకు పైగా ఋణం ఉన్నవారికి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే దుర్బుద్ధితో ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు