Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!
Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా పోలీసులు నిరుద్యోగులకు శుభవార్త తెలియజేశారు మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్ల పేర్కొన్నారు జిల్లాలోని కోస్గి పట్టణం లోని పంచాక్షరి ఫంక్షన్ హాల్ లో ఈనెల 17న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.
జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఎస్పీ క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ జాబ్ మేళా నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ ట్రెజ్డ్ ఐటి గ్రూమింగ్ ఎక్సలెన్స్ వారి సౌజన్యంతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 50 కంపెనీలకు పైగా పాల్గొనడం జరుగుతుందన్నారు.
10వ తరగతి, ఇంటర్, డిప్లమో, ఐటిఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ అండ్ ఫార్మసీ మొదలగు విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు.
మెగా జాబ్ మేళాకు హాజరయ్యే యువతి, యువకులు బయోడేటా ఫామ్ తో పాటు జిరాక్స్ సర్టిఫికెట్స్ తో హాజరుకావాలని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోస్గి ఎస్సై బాల వెంకటరమణ, నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ వారు చందర్, జీవన్, ప్రభు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. రూ.5 కోట్లు అప్పు ఇస్తామని నమ్మించి, 60 లక్షలతో పరార్..!
Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!









