TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా రూ. 14,700 తగ్గిన బంగారం ధర..!

Gold Price : మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా రూ. 14,700 తగ్గిన బంగారం ధర..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

కార్తీక మాసంలో మహిళలు భారీ శుభవార్త అందుకున్నారు. దీపావళికి ముందు రోజు రోజుకు ఆకాశాన్ని అంటేలా పెరిగిన బంగారం ధరలు.. కార్తీక మాసం ప్రారంభం కాగానే తగ్గు ముఖం పట్టాయి. ఇటీవల కాలంలోనే బంగారం ధర భారీగా తగ్గింది.

మంగళవారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 14,700 తగ్గింది. 22 క్యారెట్స్ బంగారం కు 100 గ్రాములకు రూ. 13,500 తగ్గింది. బంగారం ధర భారీగా తగ్గడంతో మహిళలు ఆనందంలో ఉన్నారు. హైదరాబాదులో బంగారం మార్కెట్ కళకళలాడుతోంది.

మరింతగా తగ్గుతుందని కొంతమంది మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ లో ఇంత భారీగా బంగారం ధర తగ్గటం ఇది రెండవసారి కావడం విశేషం. నవంబర్ 7వ తేదీన 100 గ్రాములకు 17,900 తగ్గిన బంగారం మంగళవారం 14,500 తగ్గింది.

మంగళవారం (నవంబర్ 12)వ తేదీన 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం 14,700 రూపాయలు తగ్గింది. సోమవారం (నవంబర్ 11)వ తేదీన 100 గ్రాములకు 7,87,600 రూపాయల ధర ఉండగా మంగళవారం (నవంబర్ 12)వ తేదీన 7,72,900 రూపాయల ధర ఉంది.

22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు రూ. 13,500 తగ్గింది. సోమవారం (నవంబర్ 11)వ తేదీన 7,22,000 రూపాయల ధర ఉండగా మంగళవారం
(నవంబర్ 12)వ తేదీన 7,08,500 రూపాయల ధర ఉంది.

హైదరాబాద్ లో బంగారం ధరలు (12-11-2024)

24 క్యారెట్స్ :

ఒక గ్రామం కు 7729 రూపాయలు

8 గ్రాములకు 61,932 రూపాయలు

10 గ్రాములకు 77,290 రూపాయలు

100 గ్రాములకు7,72,900 రూపాయలు

22 క్యారెట్స్ :

ఒక గ్రాముకు 7,085 రూపాయలు

8 గ్రాములకు 56,680 రూపాయలు

10 గ్రాములకు 70,850 రూపాయలు

100 గ్రాములకు 7,08,500 రూపాయలు.

MOST READ : 

మరిన్ని వార్తలు