Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం

Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 500లతో నిమిషాల్లోనే..!

Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేవలం రూ. 500లతో నిమిషాల్లోనే..!

మన సాక్షి , వ్యవసాయం :

రైతులకు గుడ్ న్యూస్ వచ్చింది. అది ఏంటంటే.. తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఈ న్యూస్ చదవాల్సిందే. రైతులు పంట పొలాల్లో పురుగు మందులు పిచ్చికారి చేయడానికి రోజంతా కష్టపడటంతో పాటు ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది.

ఇకపై ఆ అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పిచికారి చేసుకునే అవకాశం వచ్చింది. ఇది ప్రతి ఒక్క రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది. అదేంటంటే..?.

డ్రోన్ ద్వారా పురుగుమందుల పిచికారి చేసుకుని అవకాశం. డ్రోన్ 10 లీటర్ల ద్రావణం తీసుకెళ్లి ఐదు నిమిషాలలో ఒక ఎకరం పిచికారి చేస్తుంది. వరి, మిర్చి, పత్తి ఇతర పంటలే కాకుండా ఎత్తుగా పెరిగే మామిడి, బత్తాయి, నిమ్మ తోటలలో కూడా పిచికారి చేయవచ్చును. ఈ డ్రోన్ వ్యయం కేవలం ఆరు లక్షల రూపాయలుగా ఉంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో కూడా రుణ సదుపాయం అందిస్తున్నాయి.

ALSO READ : Hanuman : హనుమాన్ హీరో తేజ సజ్జా కంటిచూపు కోల్పోయింది.. వైద్యులు ఏమన్నారంటే..?

కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉంటే అద్దెకు కూడా తీసుకునే అవకాశం ఉంది. కేవలం ఒక్క ఎకరం పురుగు మందులు పిచికారి చేస్తే 500 రూపాయలు మాత్రమే చార్జి వేస్తారు.

ఒక ఎకరానికి పురుగుమందు పిచికారి చేయడానికి కేవలం 500 రూపాయలు ఖర్చు కావడంతోపాటు సమయం కూడా ఆదవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురుగుమందుల పిచికారి డ్రోన్ తో ప్రదర్శించారు. రైతులను ఇది ఎంతో ఆకట్టుకుంది.

ALSO READ : BREAKING : పండగపూట విషాదం. వేములపల్లి లో రోడ్డు ప్రమాదం, వ్యక్తి దుర్మరణం..!

సాంప్రదాయ పురుగుమందుల పిచి కారి విధానంతో పోల్చుకుంటే దీనిద్వారా సమయం ఆదా కావడంతో పాటు ఖర్చు తక్కువ అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు