Good News : నిరుద్యోగులకు శుభవార్త.. ఆ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!
పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయ ఝరాసంగంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన వివిధ బోధన, బోధనేతర పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మహేష్ వాసికర్ల గురువారం ప్రకటనలో తెలిపారు.

Good News : నిరుద్యోగులకు శుభవార్త.. ఆ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!
జహీరాబాద్, మన సాక్షి :
పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయ ఝరాసంగంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన వివిధ బోధన, బోధనేతర పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మహేష్ వాసికర్ల గురువారం ప్రకటనలో తెలిపారు.
ప్రాథమిక ఉపాధ్యాయులు, బాలవాటిక ఉపాధ్యాయులు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, యోగా కోచ్, వృత్తి విద్య ఇన్స్ట్రక్టర్, నర్స్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రాంతీయ భాషా ఇన్స్ట్రక్టర్ (తెలుగు), టి.జి.టి. ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, సోషల్ స్టడీస్, గణితం, సైన్స్ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు మార్చి 06 తేదీన ఉదయం 8.30 గంటల నుండి నిర్వహించబడతాయని తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు తమ అసలు ధృవపత్రాలు మరియు వాటి ఫోటోకాపీలతో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం విద్యాలయ అధికారిక వెబ్సైట్ను http://jharasangam.kvs.ac.in సందర్శించవచ్చని తెలిపారు.