తెలంగాణBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా పై శుభవార్త.. ఈ పథకానికి మరిన్ని నిధులు.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా పై శుభవార్త.. ఈ పథకానికి మరిన్ని నిధులు.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలియజేసింది. రైతు భరోసా పథకానికి మరిన్ని నిధులు కేటాయించి విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు మూడు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు వారి వారి ఖాతాలలో జమ చేశారు. కాగా మూడు ఎకరాల పైన ఉన్న రైతులకు కూడా త్వరలో ఖాతాలలో నిధులు జమ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 10000 రూపాయలు పెట్టుబడి సహాయంగా అందజేయగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 12 వేల రూపాయలను పెట్టుబడి సహాయం అందజేస్తుంది. ఈ పథకానికి గాను 2025 – 26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 18 వేల కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే.

కాగా వివిధ సమస్యల కారణంగా చాలామంది రైతులకు రైతు భరోసా నిధులు రాలేదని పేర్కొంటున్నారు. దాంతో రైతుల్లో అసంతృప్తి నెలకొన్నది. కాగా ఈ విషయంపై ప్రభుత్వం పైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల్లో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో త్వరలో రైతు భరోసా పథకానికి నిధులు విడుదల చేసి రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

MOST READ : 

  1. Miryalaguda : మీ ధాన్యం కు మద్దతు ధర రాలేదా.. సబ్ కలెక్టర్ ప్రత్యేక చర్యలు..!

  2. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.. లంచం ఎంతో తెలుసా..!

  3. Miryalaguda : రాష్ట్రస్థాయి ఒలంపియాడ్ పరీక్షల్లో శిష్య స్కూల్ విద్యార్థుల ప్రతిభ..!

  4. Miryalaguda : సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో జిల్లా కలెక్టర్ భోజనం..!

  5. Hyderabad : వారికి ఊరే సరి.. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!

మరిన్ని వార్తలు