Breaking Newsఆంధ్రప్రదేశ్టెక్నాలజీ

Google : గూగుల్ క్లౌడ్ ఏఐ బూట్ క్యాంప్ వర్కుషాప్..!

Google : గూగుల్ క్లౌడ్ ఏఐ బూట్ క్యాంప్ వర్కుషాప్..!

మదనపల్లి, మన సాక్షి :

మదనపల్లె సమీపంలో మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం వారు గూగుల్ క్లౌడ్ ఏఐ బూట్ క్యాంప్ వర్కుషాప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చెన్నై కు చెందిన ప్రగ్యాషల్ క్లౌడ్ సోలుషన్స్ కంపెనీ ఫౌండర్ సిఈఓ కే.యుగేంద్ర బాబు, డైరెక్టర్ పి.దీప, బిజినెస్ ఆపరేషన్స్ ప్రతినిధి జి.అమృత సాయి పాల్గొన్నారు.

కార్యక్రమంలో సిఈఓ కే.యుగేంద్ర బాబు మాట్లాడుతూ విద్యార్థులకు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికత యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఇందుకోసం గూగుల్ క్లౌడ్ ఏఐ ప్లాట్‌ఫారమ్ చాలా ఉపయోగపడుతుందని అన్నారు.

గూగుల్ క్లౌడ్ ఏ ఐ అనేది గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందించబడిన కృత్రిమ మేధస్సు మరియు మెషిన్ లెర్నింగ్ టూల్స్ డెవలపర్‌లు, వ్యాపారాలు మరియు పరిశోధకులకు వారి అప్లికేషన్ డెవలప్మెంట్ లో ఉపయోగపడుతాయని, ఈ టూల్స్ సులభంగా మరియు తక్కువ ఖర్చుతో అతి క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను అందిస్తుందని ఆయన అన్నారు.

కళాశాల పూర్వ విద్యార్ధి మరియు ప్రగ్యాషల్ క్లౌడ్ సోలుషన్స్ కంపెనీ డైరెక్టర్ పి.దీప మాట్లాడుతూ గూగుల్ క్లౌడ్‌తో ఏఐ పై పరిశోధనలు భవిష్యత్ సాంకేతిక పురోగతికి బలమైన పునాది వేసే ముఖ్యమైన సాధనంగా నిలుస్తుందని అన్నారు.

ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, రియల్ టైమ్ ప్రాజెక్టులు చేయడానికి మరియు ప్రపంచ స్థాయి కెరీర్ అవకాశాలను పొందడానికి గూగుల్ క్లౌడ్ విత్ ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పన, కోఆర్డినేటర్స్ డాక్టర్ చొక్కనాథన్, ఏం . గణేష్ రెడ్డి, విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Aadhaar : ఆధార్ కార్డులో ఫోటో బాలేదా.. మార్చుకోవాలంటే వెరీ సింపుల్..!

  2. Rythu : కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు రుణం..!

  3. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

  4. Narayanpet : జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కీలక ప్రకటన.. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురావద్దు..!

మరిన్ని వార్తలు