Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!
Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!
మనసాక్షి , వెబ్ డెస్క్ :
గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్(CERT-In) టీం ఇటీవల హై రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. గూగుల్ క్రోమ్ నిర్దిష్ట వెర్షన్లలో అనేక బగ్స్ ఉన్నాయని హెచ్చరిక జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీగా బ్రౌజర్ భద్రతా ప్రమాదాల గురించి క్రోమ్ యూజర్ల ను హెచ్చరించింది.
హెచ్చరిక :
క్రోమ్ యూజర్లు తమ సమాచారాన్ని బహిర్గతం చేసే వివిధ భద్రతా సమస్యలను ఎదుర్కొంటారు. ఫిషింగ్, అటాక్స్, డేటా చోరీ, మాల్వేర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. యూజర్లు జాగ్రత్తగా ఉండటంతో పాటు రక్షించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
అప్డేట్ చేసుకోవాలి ఇలా :
గూగుల్ క్రోమ్ ను వీలైనంత త్వరగా లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ చేయాలని (CERT -In) వినియోగదారులకు సూచిస్తుంది. మీ గూగుల్ ఇప్పటికే కొత్త అప్డేట్ రిలీజ్ చేసింది. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. విండో రైట్ అప్ కార్నర్ లో మూడు చుక్కలను క్లిక్ చేయండి. హెల్ప్.. గూగుల్ క్రోమ్.. అబౌట్.. ఎంచుకోండి. అప్డేట్ అందుబాటులో ఉంటే క్రోమ్ దాన్ని ఆటోమేటిక్ గా డౌన్లోడ్ చేసి ఇన్ స్టాల్ చేస్తుంది. అప్డేట్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత క్రోమ్ రీస్టార్ట్ అవుతుంది.
MOST READ :










