Manchiryala : ప్రభుత్వ నిధులు పక్కదారి.. గ్రామాల్లో వేయాల్సిన సి.సి రోడ్లు అవసరం లేని చోట..!
Manchiryala : ప్రభుత్వ నిధులు పక్కదారి.. గ్రామాల్లో వేయాల్సిన సి.సి రోడ్లు అవసరం లేని చోట..!
మందమర్రి, మనసాక్షి :
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో గ్రామాల్లో వేయాల్సిన రోడ్లు పక్కదారి పడుతున్నాయి అవసరం ఉన్న చోట కాకుండా ఊరి బయట సిసి రోడ్లు వేస్తున్నారని గ్రామస్తుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మందమర్రి మండల పరిధిలోని శంకర్పల్లి, చిర్రకుంట, సారంగపల్లి గ్రామాలలో స్మశాన వాటికలు, ఒక ఊరి నుండి ఒక ఊరికి లింకు రోడ్లు వేయాల్సి ఉంది.
D.M.f.T.నిధుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం సి.సి రోడ్లకై నిధులను మంజూరు చేయడం జరిగింది. ఇట్టి రోడ్ల నిర్మాణం గ్రామాల్లో కంటే గ్రామ శివారులలో వ్యవసాయ భూములకు వెళ్లే మట్టి రోడ్లపై సీ.సీ రోడ్లను వేయడం జరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయా గ్రామాల నాయకులు ప్రభుత్వం నిధులను వృధా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.
సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల తుర్కపల్లి గ్రామ జడ్పీ రోడ్డు నుండి రేషవేణి మల్లేష్ ఇంటి వరకు 5 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందని గ్రామంలో ఎన్నోచోట్ల రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతుంటే ఒక ఇంటికి 5 లక్షలతో సిసి రోడ్డు వేయడమేంటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సిసి రోడ్ల నిర్మాణంపై తగు జాగ్రత్తలు తీసుకొని సరియైన చోట రోడ్ల నిర్మాణం జరిగేలా చూడాలని గ్రామస్తులు కోరారు.
■ MOST READ :
-
District collector : గ్రామపంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Hyderabad : మియాపూర్ లో ఆక్రమణల తొలగింపు..!
-
Miryalaguda : రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆకస్మిక తనిఖీ.. సిబ్బందికి సూచనలు..!
-
Gold Price : భారీగా దిగివచ్చిన బంగారం.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ..!









