తెలంగాణBreaking Newsసంక్షేమంహైదరాబాద్

Runa Mafi : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి రూ.10 లక్షల భీమా, రుణమాఫీ నిధులు మంజూరు..!

Runa Mafi : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి రూ.10 లక్షల భీమా, రుణమాఫీ నిధులు మంజూరు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త తెలియజేసింది. లక్ష రూపాయలు లోపు రుణాలను మాఫీ చేస్తూ వారికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతోపాటు 10 లక్షల రూపాయల నేతన్న భీమా పథకం కింద ప్రయోజనం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 33 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో చిన్న చూపుకు గురైన చేనేత రంగాన్ని సంవత్సవం కాలంలో మా ప్రభుత్వం తిరిగి గాడిన పెట్టిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ శాఖల ద్వారా బట్టలు కొనుగోలు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. చేనేత రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీ, స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ స్థాపించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 60 మంది విద్యార్థులకు మూడు సంవత్సరాల డిప్లమా కోర్సు అందించబడుతుందని, చేనేత అభయ హస్త పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అదేవిధంగా నేతన్న భీమా పథకం కింద పది లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తూ వయోపరిమితిని తొలగించి నేతన్న వృత్తిలో ఉన్నంతకాలం బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

MOST READ : 

  1. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ప్రణయ్ హత్య కేసులో A2కు ఉరిశిక్ష, మిగతా నిందితులకు జీవిత ఖైదు..!

  2. Ruthu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  3. TG News : తెలంగాణలో మహిళలకు కుటుంబ భరోసా కు రూ.10 లక్షలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

  5. TG News : తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగ సంఘాలు హ్యాపీ..!

మరిన్ని వార్తలు