Employees : ఆ ఉద్యోగులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం..!
Employees : ఆ ఉద్యోగులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఆ ఉద్యోగులకు శుభవార్త తెలియజేసింది. ఉద్యోగులపై కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యావ్యవస్థ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులను తీసుకొచ్చారు.
ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్న 3,572 మంది ఒప్పంద లెక్చరర్ల సర్వీసును వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పునరుద్ధరించారు. జూన్ 1వ తేదీ నుంచి 2026 ఏప్రిల్ 30 వరకు వీరిని పునరుద్ధరించారు. దాంతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు (గెస్ట్ ఫ్యాకల్టీ) వేతనాల పెంపును కూడా ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం గంటకు 150 రూపాయల నుంచి నెలకు గరిష్టంగా 10,000 రూపాయలు ఇవ్వాలని నిబంధన ఉంది. కాగా గంటకు 375 రూపాయలు చొప్పున గరిష్టంగా 27 వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది. వారి సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం జీతాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
MOST READ :
-
Panchayat Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే.. మంత్రి పొంగులేటి క్లారిటీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Miryalaguda : రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. సబ్ కలెక్టర్ ఆదేశం..!
-
Rythu : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఈరోజు సాయంత్రం లోగా ఖాతాలలో నగదు జమ..!
-
TG News : తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. 50శాతం సబ్సిడీ..!









