Nalgonda : ప్రభుత్వాలు మారినా.. మారని విద్యార్థుల తలరాతలు..!
Nalgonda : ప్రభుత్వాలు మారినా.. మారని విద్యార్థుల తలరాతలు..!
నల్లగొండ, మన సాక్షి :
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని తక్షణమే విడుదల చేయాలని అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్చార్జిలని పెంచాలని డిమాండ్ చేస్తూ బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ ముట్టడి భారీ ర్యాలీ ధర్నా చేపట్టారు. కలెక్టరేట్లోనికి వెళ్లడానికి పోలీసులను దోచుకుని వెళ్తుండగా పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు .
ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన విద్యార్థుల తలరాతలు మారట్లేదు విద్యార్థి బాధలు తీరట్లేదు గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లని స్కాలర్షిప్లని తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఎస్సీ ఎస్టీ బీసీఈ బీసీమైనారిటీ విద్యార్థుల గత రెండు సం. ఫీజుల బకాయిలు 3 వేల కోట్లు వెంటనే చెల్లించాలి. ఇంజనీరింగ్ పి.జి. డిగ్రీ- ఇంటర్ తదితర కాలేజి కోర్సులు చదివే బిసి ఈ బిసి విద్యార్థులు పూర్తి ఫీజులు మంజూరు చేయాలన్నారు. ఈ స్కీమును 2008 పెట్టినట్లుగా యదాతథంగా అమలు చేయాలని
కాలేజి ద్యార్థులకు సంవత్సరం కు 20 వేల స్కాలర్ షిప్ ప్రతి విద్యార్ధికి నుంజూరుచేయాలి.
ఇంటర్ మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ రేటు రూ.1800 నుండి రూ.15 వేలకు పెంచాలి. మొత్తం ప్రభుత్వమే మంజూరు చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1500 నుండి 3 వేలకు, పాఠశాల ఎస్సీ ఎస్టీ బీసీహాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1100 నుంచి 2 వేలకు పెంచాలి బి.సిలకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బి.సి గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలి.
ఇటీజుల ముఖ్యమంత్రి బి.సిలకు 33 గురుకుల పాఠశాలలు, 15 బి.సి గురుకుల డిగ్రీ కాలేజిలు మంజూరు చేశారు. బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్యనాయకత్వంలో 120 బి.సి గురుకుల పాటశాలలు, 50 డిగ్రీ కాలేజిలు మంజూరు చేయాలని పోరాడుతున్నామని తెలిపారు. పూర్తి డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోలగోని వెంకటేష్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ ,జక్క నాగేశ్వరరావు విద్యార్థి సంఘం నాయకులు పొగాకు రవికుమార్ ,బచ్చనబోయిన సాయికుమార్ యాదవ్, చింతల విజయకుమార్, బచ్చన బోయిన రాజు యాదవ్, తరుణ్ కుమార్ యాదవ్ ,మహేష్, మణికంఠ, స్వామి, శ్రీకాంత్ ,,మహేందర్ ,అని కుమార్ ,ఫణి కుమార్ గణేష్ ,పృధ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
Miryalaguda : దోమకాటుకు పురుగు మందు చల్లితే.. ఉన్న పొలం ఎండిపోయింది, రైతు కుటుంబం ధర్నా..!
-
Aadhar Card : ఆధార్ కార్డు ట్యాంపరింగ్.. కొత్త తరహాలో సైబర్ మోసం..!
-
District collector : ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్..!
-
District Collector : నల్లగొండ చక్కని వేదిక.. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి..!










