TOP STORIESBreaking Newsతెలంగాణ

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

మనసాక్షి, వెబ్ డెస్క్:

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడవసారి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఇంకా కొనసాగించేలా ప్లాన్ చేసింది. కాగా ఈ పథకం ద్వారా మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ ఇచ్చే పథకం యధావిధిగా కొనసాగిస్తుంది. ఈ పథకం ద్వారా ఇప్పటికీ చాలామంది లబ్ధి పొందినా.. మరింత మందికి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కేంద్రం వృత్తి పని వారికి ప్రత్యేకమైన పనిముట్లు, యంత్రాలను అందిస్తుంది. అయితే వాటికి పనిముట్లు కాకుండా డబ్బులు ఇస్తూ ఆ డబ్బుల రూపంలో కొనుక్కునేలా చేస్తుంది. అలాంటి పథకంలోనే కుట్టు మిషన్ పథకం కూడా ఉంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని కొనసాగిస్తుంది.

ఈ పథకం ద్వారా కుట్టు మిషన్ కొనుక్కునేందుకు 15 వేల రూపాయలను పొందవచ్చును. ఈ డబ్బును నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. కుట్టు మిషన్ రాని వాళ్లు కూడా నేర్చుకునేందుకుగాను వారం రోజులపాటు డిజిటల్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. టైనింగ్ సమయంలో కూడా రోజుకు 500 రూపాయల చొప్పున చెల్లిస్తుంది.

కుట్టుమిషన్ కొనుక్కున్న తర్వాత కూడా షాప్ పెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష రూపాయల రుణం అందిస్తుంది. ఈ రుణాన్ని 18 నెలల లోపు చెల్లించాల్సి ఉంటుంది. అది పూర్తిగా చెల్లించాక మరో రెండు లక్షల రూపాయల రుణం కూడా ఇస్తుంది. దానిని 30 నెలల లోపు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణాలు కావడం వల్ల చాలా తక్కువగా వడ్డీ ఉంటుంది. మహిళలే కాకుండా పురుషులు కూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకో వచ్చును.

దరఖాస్తుకు అర్హతలు :

ఉచిత కుట్టు మిషన్ పథకం పొందేందుకు దరఖాస్తులు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు అర్హులే. ఇప్పటికే కుట్టు పని చేస్తున్న వారు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్ గా పని చేసే ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు 18 సంవత్సరాల పైబడి ఉండాలి. అందుకుగాను దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, చిరునామా ప్రూఫ్, గుర్తింపు కార్డు, కుల దృవీకరణ పత్రం, పాస్ ఫోటో, మొబైల్ నెంబర్, బ్యాంకు పాసుబుక్ ఉండాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి :

ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం అధికారిక వెబ్సైట్ https://pmvishwakarma.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఆన్ లైన్ లో కుదరదు అనుకుంటే మీ దగ్గరలోని మీసేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చును. మీరు దరఖాస్తు చేశాక రషీదు కూడా వస్తుంది. ఆ రసీదును మీ దగ్గరనే ఉంచుకోవాలి. ఆ తర్వాత కొన్ని రోజులకు కేంద్రం మీ బ్యాంక్ అకౌంట్ లో మనీ జమ చేస్తుంది. కేంద్రం మనీ జమ చేశాక కుట్టుమిషన్ కొనుక్కోవచ్చును.

ఇవి కూడా చదవండి : 

Nagarjunasagar : రెండేళ్ల తర్వాత నిండిన సాగర్.. 22 గేట్ల ద్వారా నీటి విడుదల, కొనసాగుతున్న వరద.. Latest Update

మిర్యాలగూడ : మల్టీ డ్రగ్ వన్ స్టెప్ టెస్ట్ డివైస్ తో గంజాయి సేవించిన వారి గుర్తింపు..!

మిర్యాలగూడ : టాయిలెట్స్ లేవని విద్యార్థినిలు ఎంఎల్ఏ కు మొర.. కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం..

మరిన్ని వార్తలు