తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా చూడాలి.. కలెక్టర్ ఆదేశం..!

District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా చూడాలి.. కలెక్టర్ ఆదేశం..!

జగిత్యాల, (మన సాక్షి) :

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు
జరగకుండా చూడాలని కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం కొండ్రికర్ల వేంపేట , మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామాల్లో పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.

ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం ధాన్యం మ్యాచింగ్ చేయాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల లోపు మిల్లులకు తరలించాలని
అలాగే, ట్యాబ్ డేటా ఎంట్రీ నమోదు, లారీ ట్రక్ సెట్  తప్పనిసరిగా ఎంట్రీ చేయాలన్నారు.

ప్రతి రోజు ఎన్ని లారీలు తరలించబడుతున్నాయి, ఎంత ధాన్యం వస్తుంద నీ ఒక్కో లారీలో ఎన్ని  బస్తాలు  అనే వివరాలు నిరంతరం నమోదు చేసి, తగిన రికార్డులు నిర్వహించాలి అని సూచించారు. ధాన్యం సెంటర్లలో తప్పనిసరిగా ప్యాడి క్లీనర్ ఉంచాలన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, నీటి సదుపాయం, ఓ ఆర్ ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు.

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హమాలీలు ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డివిజనల్ అధికారి శ్రీనివాస్ ,డిఆర్డిఓ రఘువరన్ మండల తాసిల్దార్లు ఇతర సంబంధిత అధికారులు  ప్రతినిధులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. FY Results: సీఎస్‌బీ బ్యాంక్, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ మార్చి త్రైమాసిక ఫలితాలు..!

  2. Miryalaguda : సబ్ కలెక్టర్ సంచలన నిర్ణయం.. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..!

  3. Thati Kallu : తాటి కల్లు ఆరోగ్యనికి మంచిదేనా.. తెలుసుకుందాం..!

  4. Miryalaguda : ఇష్టానుసారంగా ప్రైవేట్ ఆస్పత్రులు.. అధికారుల తనిఖీలు, నోటీసులు..!

మరిన్ని వార్తలు