Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుసూర్యాపేట జిల్లా
ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు..!
ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు..!
కోదాడ, మనసాక్షి :
డీజీఎం లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జోనల్ ఇంచార్జ్ సురేష్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవుని ఆశీస్సులు పిల్లలందరికీ కలగాలని కోరుకున్నారు. ప్రిన్సిపాల్ పుల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో పూలను దైవంగా భావించి పూజించడం జరుగుతుంది అని చెప్పారు.
ఈ పండుగ 9 రోజులు ఘనంగా నిర్వహిస్తారు అని తెలియజేశారు. ప్రకృతి ని ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ అని తెలియజేశారు. విద్యార్థులు బతుకమ్మని తయారు చేసి ఆటపాటలతో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపు కొన్నారు. అనంతరం బతుకమ్మ లను నీటిలోకి వదిలి మళ్లీ రావమ్మా అని పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
BREAKING : కోదాడలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ యువకులు మృతి..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు మీరు అర్హులేనా.. నిబంధనలు ఖరారు..!
-
Cm Revanth Reddy : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి..!
-
Morning Drinks : టాప్ 7 మార్నింగ్ డ్రింక్స్.. అధిక కొలెస్ట్రాల్ మాయం, గుండె భద్రం..!









