TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu : రైతులకు అదిరిపోయే న్యూస్.. రేపే ఖాతాలోకి డబ్బులు..!

Rythu : రైతులకు అదిరిపోయే న్యూస్.. రేపే ఖాతాలోకి డబ్బులు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త తెలియజేసింది. వానకాలం సీజన్ నుంచి రైతులకు సన్నధాన్యం విక్రయించిన వారికి బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు సన్నధాన్యం విక్రయించుకున్న వారికి క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వనున్నారు. కాగా ధాన్యం విక్రయించుకున్న రైతులకు 48 గంటల్లో డబ్బులు చెల్లించాలని అధికారులను సైతం ఆదేశించారు.

బోనస్ కు సంబంధించిన డబ్బులు ప్రభుత్వం విడుదల చేసింది. క్వింటాకు 500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో ఈనెల 18 సోమవారం జమ కానున్నాయి. ఇప్పటివరకు ధాన్యం విక్రయించిన రైతులందరికీ బోనస్ క్వింటాకు 500 రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాలలో వేయనున్నారు

MOST READ  : 

మరిన్ని వార్తలు