Alumni : 13 ఏళ్ల తర్వాత ఘనమైన వసంతోత్సవం.. గురు శిష్యుల బంధం మహోన్నతమైనది..!

Alumni : 13 ఏళ్ల తర్వాత ఘనమైన వసంతోత్సవం.. గురు శిష్యుల బంధం మహోన్నతమైనది..!
భీంగల్, మన సాక్షి :
భీంగల్ మండలంలోని బడా భీంగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (2011-2012)పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం చదువుకున్న పాఠశాలలో వేదిక చేసుకొని 13 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యుల తోసహా ఆత్మీయంగా కలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు విద్యను బోధించిన ఉపాధ్యాయులు ప్రవీణ్, రఘువాస్, సురేష్,అనితరాణి,రాజేశ్వర్ (పి ఈటీ ) ఉపాధ్యాయులకు ఘనంగా శాలువ పూలమాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ,ఉపాధ్యాయులు మాట్లాడుతూ. 13 సంవత్సరాలు తర్వాత కూడా మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుంచు కోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమాజంలో ఎప్పటికీ విద్యను బోధించిన ఉపాధ్యాయులను మరవకుండా ఇలాగే గుర్తుంచుకోవాలని అన్నారు.
గురు శిష్య బంధం కుటుంబ బంధం కన్నా మహెున్నమైనది అన్నారు. విద్యార్థులు ప్రణాళికతో ముందుకు సాగి సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ,గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ,వ్యాపారం, సామాజిక సేవ,సకల రంగాలలో సేవ చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగులుగా రాణించి, కష్టాల్లో ఆపద్బాం ధవులుగా నిలవాలని కాంక్షించారు.
పూర్వ విద్యార్థులందరూ ఒకచోట కలిసి బాల సంస్కృతి లో గుర్తు చేసుకున్నారు. సాయంత్రం వరకు కలిసిమెలిసి డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విద్యార్థినిలు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!
-
TG News : హుస్సేన్ సాగర్ తీరాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైకత శిల్పం..!
-
Alumni : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. 17 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు..!
-
TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!









