Groups : పేదరికాన్ని జయించిన స్నేహ.. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ -1..!
Groups : పేదరికాన్ని జయించిన స్నేహ.. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ -1..!
జగిత్యాల, (మన సాక్షి)
జగిత్యాల జిల్లా పెగడ పల్లి మండలం బతికే పెల్లి గ్రామానికి చెందిన గాలిపెల్లి రాజమౌళి-అనూషల కుమార్తె గాలిపెల్లి స్నేహ కు ఈనెల 10న గ్రూప్ 1 ఫలితాలు విడుదల కాగా 517 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి లో 485 ర్యాంకు పొందింది,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకోనున్నట్లు తెలిపారు. స్నేహ గతంలో (సిఎ) పూర్తిచేసుకుని ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగం నిర్వహిస్తూ గ్రూప్ 1 కు మొదటి ప్రయత్నంలోనే 485 రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించింది. పేద కుటుంబానికి చెందిన స్నేహ గ్రూప్1 ర్యాంకు సాధించడంతో కుటుంబసభ్యులు. గ్రామస్తులు హర్షం వెలిబుచ్చారు.
అభినందించిన విశ్వబ్రాహ్మణ సంఘం :
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికె పెళ్లి గ్రామానికి కు చెందిన గాలి పెల్లి స్నేహ గ్రూప్ 1 ర్యాంకు సాధించడంతో విశ్వబ్రాహ్మణ సంఘం పక్షాన విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు టీవీ సత్యం అభినందనలు తెలిపారు. స్నేహను ఆదర్శంగా తీసుకొని యువతీ యువకులు ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.
MOST READ :
-
Groups : డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!
-
PDS : పిడిఎస్ బియ్యం భారీగా పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్. !
-
Runa Mafi : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి రూ.10 లక్షల భీమా, రుణమాఫీ నిధులు మంజూరు..!









