Gruhajyothi : గృహజ్యోతి.. 200 యూనిట్ల ఉచిత విద్యుతుకు బ్రేక్..!
Gruhajyothi : గృహజ్యోతి.. 200 యూనిట్ల ఉచిత విద్యుతుకు బ్రేక్..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండు గ్యారెంటీ హామీలు అమలు చేస్తుండగా మరో రెండు గ్యారెంటీ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ రీఫీలింగ్ చేయాలని భావించింది. ఈ తరుణంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు వినియోగదారుల నుంచి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబర్ లింకు చేయనున్నట్లు.. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభించారు. కాగా విద్యుత్ అధికారులు తమ ఇండ్లకే వచ్చి వివరాలు తీసుకుంటారని వారికి సహకరించాలని కోరారు.
కాగా విద్యుత్ మీటర్ రీడింగ్ చేసేవారు ఇప్పటికే తమకు పని భారం అవుతుందని డిమాండ్లు పెట్టారు. దాంతో గృహలక్ష్మి పథకానికి కొంతకాలం బ్రేక్ పడనుందా..? లేక విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు వెంటనే పరిష్కరించి పథకాన్ని వెంటనే కొనసాగిస్తారా..? అనేది వేచి చూడాల్సి ఉంది.
సమస్యలు పరిష్కరించాలని మీటర్ రీడర్స్ ధర్నా :
మీటర్ రీడర్ కార్మికులు మీటర్ రీడర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక నల్గొండ లోని ఎన్జీ కాలేజీ ముందు రోడ్డుపై ధర్నా చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో విద్యుత్ మీటర్ రీడింగ్ తీస్తున్నామని గృహ జ్యోతి లో భాగంగా తమకు ప్రభుత్వం అదనంగా పని భారం అవుతుందని, మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు రేషన్ కార్డు, నెంబర్లు మీటర్ నెంబర్ కు, లింకు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో తమకు పని భారం పెరిగిందన్నారు.
ALSO READ : Nalgonda : ప్రేమ జంటలను బెదిరించి ఆభరణాలు, డబ్బులు దోపిడీ.. ముఠా అరెస్ట్..!
గత కరోనాలో కూడా తాము ప్రాణాలకు తెగించి మీటర్స్ రీడింగ్ తీశామని, తాము పనికి తగ్గ వేతనం కోరుతున్నామని, తమను ఆర్టిజన్లుగా గుర్తించాలని తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు.
కార్యక్రమంలో మేడి యాదగిరి , కంచనపల్లి కిరణ్ ,చంద్రశేఖర్ రెడ్డి, శివశంకర్, ఇస్మాయిల్, కుమారస్వామి, సైదులు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.










