అంతా మనవాళ్లే ఎలాగైనా గెలవచ్చనుకుని దరఖాస్తులు.. నల్లగొండ, భునగిరి ఎంపీ టికెట్లకు కాంగ్రెస్ పార్టీలో పరిశీలించే పేర్లు ఇవేనా..?

ఎలాగైనా గెలవచ్చు.. అందరూ ఎమ్మెల్యేలు మనవాళ్లే ఉన్నారుగా.. ఎంపీ టికెట్ కు దరఖాస్తు చేస్తే పోలా.. ఈజీగా గెలవచ్చు. అనుకొని కుప్పలు తెప్పలుగా ఎంపీ టికెట్లకు కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరిలో అసలైన పోటీదారుల్ని ఎవరిని పెట్టాలనే విషయంపై హై కమాండ్ ఆదేశాల మేరకు పిసిసి ఎన్నికల కమిటీ, వడపోత కార్యక్రమం చేపట్టింది.

అంతా మనవాళ్లే ఎలాగైనా గెలవచ్చనుకుని దరఖాస్తులు.. నల్లగొండ, భునగిరి ఎంపీ టికెట్లకు కాంగ్రెస్ పార్టీలో పరిశీలించే పేర్లు ఇవేనా..?

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

ఎలాగైనా గెలవచ్చు.. అందరూ ఎమ్మెల్యేలు మనవాళ్లే ఉన్నారుగా.. ఎంపీ టికెట్ కు దరఖాస్తు చేస్తే పోలా.. ఈజీగా గెలవచ్చు. అనుకొని కుప్పలు తెప్పలుగా ఎంపీ టికెట్లకు కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరిలో అసలైన పోటీదారుల్ని ఎవరిని పెట్టాలనే విషయంపై హై కమాండ్ ఆదేశాల మేరకు పిసిసి ఎన్నికల కమిటీ, వడపోత కార్యక్రమం చేపట్టింది.

లోకసభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఆ పార్టీలో జోష్ పెరిగింది కొంతమంది ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా ఎంపి స్థానాలకు దరఖాస్తులు చేసుకున్నారు. అంతేకాకుండా మరి కొంత మంది నియోజకవర్గస్థాయి నాయకులే కాదు, కనీసం వారి పేర్లు కూడా ప్రజలకు తెలియని వాళ్లు కూడా దరఖాస్తులు చేసుకోవడం విశేషం.

ALSO READ : రేవంత్, భట్టి.. సోనియాను కలిసింది అందుకేనా..! లోక్ సభకు పోటీలో మతలబు ఉందా..!

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల తాము తెలుస్తామని కొంతమంది వ్యాపారస్తులు, వివిధ వర్గాల వారు కూడా ఎంపీ టికెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ఒక్కొక్క ఎంపీ స్థానం కు భారీగా దరఖాస్తులు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. అందుకుగాను309 దరఖాస్తులు అందాయి. భారీగా వచ్చిన దరఖాస్తులలో హైకమాండ్ ఆదేశాల మేరకు ఒక్కొక్క నియోజకవర్గంలో నుంచి ముగ్గురు లేదా నలుగురిని పరిశీలించాలని సూచించింది.

ఈ మేరకు ఎన్నికల కమిటీ మూడు పేర్లను పరిగణలోకి తీసుకొని ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాల గాను 309 దరఖాస్తులు అందాయి. అందులో అత్యధికంగా మహబూబాబాద్ నియోజకవర్గ నుంచి 18, మహబూబ్ నగర్ కు అతి తక్కువగా 4 దరఖాస్తులు మాత్రమే అందాయి. పీసీసీ ఎన్నికల కమిటీ గెలిచే అభ్యర్థులను పరిగణలో తీసుకోవడానికి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.

ALSO READ : SAGAR : తల్లిని రక్షించబోయి అన్నని హతమార్చిన చెల్లెలు..!

ఇది ఇలా ఉండగా నల్లగొండ , భువనగిరి ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలుగా ఉన్నాయి. కాగా వాటిలో నల్లగొండ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఆయన తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్నా కైలాష్ నేత, నవీన్ కుమార్ రెడ్డి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.