రేవంత్, భట్టి.. సోనియాను కలిసింది అందుకేనా..! లోక్ సభకు పోటీలో మతలబు ఉందా..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ,మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కలిసిన విషయం విధితమే. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముగ్గురు ఆమెని కలవడం రాష్ట్రంలో చర్చనీ అంశంగా మారింది.

రేవంత్, భట్టి.. సోనియాను కలిసింది అందుకేనా..! లోక్ సభకు పోటీలో మతలబు ఉందా..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ,మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కలిసిన విషయం విధితమే. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముగ్గురు ఆమెని కలవడం రాష్ట్రంలో చర్చనీ అంశంగా మారింది. తెలంగాణ నుంచి పార్లమెంట్ కు సోనియాగాంధీని పోటీ చేయాలని ఆహ్వానించడంతో పాటు మరి ఏమైనా మతలబ్ ఉందా..? అని కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత చర్చ కొనసాగుతుంది.

సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీలో ఎందుకు నిలబెట్టాలని భావిస్తున్నారనే విషయం కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ పిసిసి సమావేశంలో కూడా తెలంగాణ నుంచి సోనియాలో పోటీ చేయించాలని తీర్మానం కూడా చేసిన విషయం తెలిసిందే.

సోనియా గాంధీని కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా కాగా ఇప్పుడు భట్టి విక్రమార్క ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి ఖమ్మం నుంచి సోనియాగాంధీని పోటీ చేయించాలని కలిసినట్లు సమాచారం..

ALSO READ : BREAKING : కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి వెళ్లిన స్మగ్లర్లు.. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మృతి..!

ఇది ఇలా ఉండగా సోనియా గాంధీ సొంత రాష్ట్రం నుంచి, సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేయకుండా దక్షిణ భారతదేశం నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారని విషయం చర్చ గా మారింది. రాహుల్ గాంధీ ఇప్పటికే దక్షిణ భారతదేశం నుంచి లోకసభ పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా పార్టీని బలోపేతం చేయడానికి సోనియా గాంధీ ఉత్తర భారతదేశం నుంచి పోటీలో ఉంటేనే అక్కడ కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అద్వానంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా సోనియా గాంధీ ఉత్తర భారతదేశం నుంచి కాకుండా తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఉపయోగం ఉంటుందా..? లేదా..? అనేది ఏఐసీసీలో పెద్దలు చర్చిస్తున్నారు.

తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. పార్టీ కూడా బలంగానే ఉంది. కానీ సోనియాగాంధీ పోటీ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా..? అనే విషయం ఏఐసీసీలో చర్చించనున్నట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.

ALSO READ : అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై వెంటాడి దాడి.. (వీడియో)

అదేవిధంగా పోనియా గాంధీ ఫోటోలు తెలంగాణలో వినియోగించడం, అధికారిక కార్యక్రమాలలో ఆమె పాల్గొనేలా ఉండేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ విధంగా ప్లాన్ వేశారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు కానీ బిజెపి నాయకులు గానీ కాంగ్రెస్ ప్రభుత్వం మునగడ కొంతకాలమే ఉంటుందని బహిరంగంగానే ప్రకటనలు చేసిన విషయం విధితమే.

కాగా సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోకసభకు ఎన్నికైనట్లయితే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల మనుగడకు కూడా డోకా లేకుండా ఉంటుందని భావించి ఆమెని ఆహ్వానిస్తున్నారా..? సొంత పార్టీలో కూడా నాయకులు తిరుగుబాటు చేసే అవకాశం లేకుండా సోనియాగాంధీ ని తెలంగాణకు తీసుకురావాలని భావిస్తున్నారా..? అనే విషయం పార్టీలో కూడా చర్చగా కొనసాగుతుంది. ఏది ఏమైనా సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని బడా నాయకులంతా బలంగా కోరుతున్నారు.