Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

BREAKING : కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి వెళ్లిన స్మగ్లర్లు.. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మృతి..!

BREAKING : కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి వెళ్లిన స్మగ్లర్లు.. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మృతి..!

రూ. 30 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు

ఎర్రచందనం దుంగలతో సహా కారు స్వాధీనం

మదనపల్లి, మన సాక్షి :
ఎర్రచందనంతో కారులో వెళుతున్న స్మగ్లర్లను నిలువరించే క్రమంలో స్మగ్లర్ల వాహనం ఢీ కొట్టి వెళ్లడంతో కానిస్టేబుల్ గణేష్ (32) మంగళవారం మృతి చెందారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణా రావు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని సందర్శించి తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. టాస్క్ ఫోర్స్ కు అందిన సమాచారం మేరకు ఆర్ ఎస్ ఐ విశ్వనాథ్, వినోద్ టీమ్ లు సోమవారం రాత్రి అన్నమయ్య జిల్లా కే వి పురం సుండుపల్లి మార్గం లో తనిఖీలు నిర్వహించారు.

స్మగ్లర్లు వస్తారనే సమాచారం ఉండటంతో గుండ్రేవారిపల్లి ప్రాంతంలో మాటు వేశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్విఫ్ట్ వాహనం రాగా దానిని సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్మగ్లర్లు కారు ఆపకుండా వేగం పెంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాహనాన్ని ఆపుదామని కానిస్టేబుల్ గణేష్ ప్రయత్నించాడు.

ALSO READ : SAGAR : తల్లిని రక్షించబోయి అన్నని హతమార్చిన చెల్లెలు..!

అయితే స్మగ్లర్లు అతన్ని గుద్ది వేగంగా ముందుకు వెళ్లారు. ఒక పల్లపు ప్రదేశంలో వారి వాహనం ఆగిపోయింది. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని పట్టుకునెందుకు ప్రయత్నించారు. దీంతో కారులో నుంచి దూకి డ్రైవర్ సహా ముగ్గురు పారిపోగా, ఇద్దరిని పట్టుకున్నారు.

వీరిని తమిళనాడు వాసులుగా గుర్తించారు. పారిపోయిన వారికోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కారులో లభించిన ఏడు దుంగలను, కారును స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్ గణేష్ ను పీలేరు ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి ఎస్పీలు కృష్ణారావు, శ్రీనివాస్ చేరుకుని పరి స్థితి సమీక్షించారు.

ALSO READ : BREAKING : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరిక..!

ఆసుపత్రికి చేరుకుని గణేష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని గణేష్ భౌతిక కాయానికి అంజలి ఘటించారు. ఈ సంఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం
రూ. 30 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.గణేష్ కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు