అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై వెంటాడి దాడి.. (వీడియో)

అమెరికాలో భారతీయ విద్యార్థి తెలంగాణకు చెందిన విద్యార్థి పై దాడి జరిగింది. పరుగు పెడుతుండగా వెంటాడి దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది.

అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై వెంటాడి దాడి.. (వీడియో)

మన సాక్షి :

అమెరికాలో భారతీయ విద్యార్థి తెలంగాణకు చెందిన విద్యార్థి పై దాడి జరిగింది. పరుగు పెడుతుండగా వెంటాడి దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ఒకరు ట్విట్టర్ పెట్టగా అది వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన భారతీయుల్లో ఆందోళన నెలకొన్నది. అమెరికాలో వరుస దాడులతో ఉన్నత విద్య కోసం వెళ్లిన భారతీయుల్లో ఆందోళన కలిగించే అంశంగా ఈ సంఘటన మారింది.

తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థి చికాగోలోని అతని ఇంటి సమీపంలో దొంగలు అతనిపై దాడి చేశారు. మాటు వేసి ఆ విద్యార్థి పై దాడి చేసిన వీడియోలు వైరల్ గా మారాయి.

ఒక వీడియోలో బాధితుడు సయ్యద్ ముజాహిర్ తన ఫోను కూడా లాక్కున్నారని, దొంగలు తనపై దాడి చేశారని, రక్తస్రావంతో ఏడుస్తూ తనకు హెల్ప్ చేయాలని కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి చూడటం వల్ల ఆందోళన వ్యక్తం అవుతుంది.

ALSO READ : BREAKING : కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి వెళ్లిన స్మగ్లర్లు.. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మృతి..!

మంగళవారం తెల్లవారుజామున చికాగోలోని క్యాంప్ బెల్ అవెన్యూలోని హైదరాబాద్ కు చెందిన తనను ముగ్గురు వెంబడించడం ఒక వీడియోలో కనిపిస్తుండగా.. మరో వీడియోలో తనకు రక్తస్రావం జరిగి తనకు హెల్ప్ చేయాలంటూ మరో వీడియో కనిపిస్తుంది.

హైదరాబాదులోని లంగర్ హౌస్ లో నివాసం ఉంటున్న సయ్యద్ ముజాహిద్ అలీ ఇండియానా వెస్లీయన్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ కోసం అమెరికా వెళ్ళాడు. తాజా ఘటనతో దాడికి గురైన భారతీయ విద్యార్థితో భారత కన్సలేట్ సంప్రదించింది. అతని కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని భారత హై కమిషన్ పేర్కొన్నది.