Miryalaguda : మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని వ్యక్తి మృతి..!
మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది

Miryalaguda : మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని వ్యక్తి మృతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దామరచర్ల మండలం పెద్దతండ, కే జే ఆర్ కాలనీ, దిలావర్ పూర్ కు చెందిన ధనావత్ మంగ్తా (61) లారీ ఢీకొని మృతి చెందాడు. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో బ్యాంక్ ఆఫ్ బరోడా లో పని ఉండి తన టీవీఎస్ ఎక్సెల్ పై మిర్యాలగూడకు వచ్చారు.
Also Read : కన్న తండ్రిని చంపిన కొడుకు.. జీవితాంతం జైలు శిక్ష..!
ఉదయం 10:30 గంటల సమయంలో టీ తాగడం కోసం హనుమాన్ పేట ఫ్లైఓవర్ వద్దకు రాగా అదే సమయంలో లారీ ఏ పి 24 వి 9036 నెంబర్ గల లారీ సాగర్ రోడ్డు నుండి హైదరాబాద్ పోవుటకు లారీ డ్రైవర్ షేక్ ఖాజా నిర్లక్ష్యంగా నడిపి లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోగా లారీ ముందు టైర్లు మృతుడి తలం మీదుగా వెళ్ళగా తల పగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతుని కొడుకు దానవత్ కృష్ణ పిర్యాదు మేరకు మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









