కన్న తండ్రిని చంపిన కొడుకు.. జీవితాంతం జైలు శిక్ష..!
మహబూబ్ నగర్రా జిల్లా జాపూర్ మండలం పరిధిలో డబ్బుల విషయంలో తల్లిదండ్రులతో తరచూ గొడవపడుతూ, కన్న తండ్రిని గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కేసులో నిందితుడైన కవాలి నదేశ్ ఆనంద్ కు పి.ఆంజనేయులు, ఫ్యామిలీ కోర్టు కమ్ (III) అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, మహబూబ్నగర్ శుక్రవారం సాధారణ జీవిత ఖైదీగా మరియు రూ.5,000/- జరిమానా విధిస్తూ తీర్పు విధించారు.

కన్న తండ్రిని చంపిన కొడుకు.. జీవితాంతం జైలు శిక్ష..!
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 25
(మన సాక్షి జిల్లా ప్రతినిధి )
మహబూబ్ నగర్రా జిల్లా జాపూర్ మండలం పరిధిలో డబ్బుల విషయంలో తల్లిదండ్రులతో తరచూ గొడవపడుతూ, కన్న తండ్రిని గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కేసులో నిందితుడైన కవాలి నదేశ్ ఆనంద్ కు పి.ఆంజనేయులు, ఫ్యామిలీ కోర్టు కమ్ (III) అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, మహబూబ్నగర్ శుక్రవారం సాధారణ జీవిత ఖైదీగా మరియు రూ.5,000/- జరిమానా విధిస్తూ తీర్పు విధించారు.
వివరాల ప్రకారం.. 2024 సెప్టెంబర్ 19న రాత్రి సమయంలో రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామంలో డబ్బుల విషయంలో తల్లిదండ్రులతో గొడవపడిన నిందితుడు నదేశ్, ఆనంద్ తన తండ్రి కవాలి నారాయణ పై గొడ్డలితో మెడపై పలుమార్లు దాడి చేశాడు.కేకలు విని ఇంట్లోకి వెళ్లిన తల్లి కవాలి చంద్రకళ తన భర్తపై కుమారుడు గొడ్డలితో దాడి చేస్తున్నట్లు గుర్తించింది. తీవ్రంగా గాయపడిన నారాయణను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి మృతి చెందాడు.
Also Read : Miryalaguda : చట్టాలు కాగితాల మీద కాదు.. అమలులో ఉండాలి..!
మృతుడి భార్య కావాలి చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాపూర్ ఎస్ఐ రవి కేసు నమోదు చేసి, జడ్చర్ల రూరల్ సీఐ టి.నాగార్జున గౌడ్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగించి, నిందితుడిపై న్యాయస్థానంలో అభియోగాలు రుజువయ్యే విధంగా ఆధారాలను సమర్పించారు.
తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ జీవిస్తుండగా, ఎటువంటి పని పాట లేకుండా ఉన్న నిందితుడు డబ్బుల కోసం వారితో తరచూ గొడవపడేవాడని దర్యాప్తులో వెల్లడైంది.
ఈ నేపథ్యంలోనే ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టి.నాగార్జున గౌడ్, కేసు నమోదు చేసిన ఎస్ఐ రవి, ఏ పి పి కె.నరేష్ కుమార్, జె.శ్రీనివాస్, హెచ్ సి 160, ఫ్యామిలీ కోర్టు లైజన్ అధికారి, డీఈవో జె.శేఖర్, పి సి 2177 అధికారుల పనితీరును ఎస్పీ అభినందించాలి నేరాలకు పాల్పడే వ్యక్తులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో పోలీసు శాఖ సమన్వయంతో పనిచేస్తుందని ఎస్పీ తెలిపారు.