Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణపండుగలుహైదరాబాద్

బాలాపూర్ లడ్డు రూ.39 లక్షలకు దక్కించుకున్న సామా ప్రణీత్ రెడ్డి..!

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డు వేలం పాట శుక్రవారం ముగిసింది. వేలం పాటలో 39 లక్షల రూపాయలకు అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు.

బాలాపూర్ లడ్డు రూ.39 లక్షలకు దక్కించుకున్న సామా ప్రణీత్ రెడ్డి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డు వేలం పాట (2026) శుక్రవారం ముగిసింది. వేలం పాటలో 39 లక్షల రూపాయలకు అర్బన్ గ్రూప్ సామా ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ వేలంపాట కోసం మొత్తం తొమ్మిది మంది పేర్లు నమోదు చేసుకోగా అందులో ఐదు కంపెనీలు నమోదు చేసుకున్నారు. బాలాపూర్ లడ్డు వేలంపాట కోసం ఎన్నారైలు సైతం వచ్చారు.

కాగా బాలాపూర్ బొడ్రాయి వద్ద నిర్వహించిన వేలం పాటలో 39 లక్షల రూపాయలకు సామా ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాది 35 లక్షలు పలికిన వేలంపాట ధర ఈ ఏడాది 39 లక్షల రూపాయలకు ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డుకు ప్రత్యేకత ఉంది. 1994వ సంవత్సరం నుంచి బాలాపూర్ లడ్డు వేలం పాట పాడుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు