తల్లిని హతమార్చిన కుమారుడు.. ఎందుకంటే..?
వరంగల్ రూరల్ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ నగర్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిని కుమారుడు హతమార్చిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో చోటు చేసుకుంది.

తల్లిని హతమార్చిన కుమారుడు.. ఎందుకంటే..?
మన సాక్షి, వెబ్ డెస్క్:
వరంగల్ రూరల్ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ నగర్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిని కుమారుడు హతమార్చిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read : ప్రణయ్ హత్య కేసులో ఏ 4 నిందితుడు అబ్దుల్ బారీ చర్లపల్లి జైలులో మృతి..!
వరంగల్ రూరల్ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ కు చెందిన నాగుల సుధాకర్, ఉదయశ్రీ దంపతులు 20 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న ఆ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుధాకర్ స్థానిక ప్రైవేట్ కంపెనీలో అటెండర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భార్య ఉదయశ్రీ ఇంస్టాగ్రామ్ లో చూస్తూ గడిపేది. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో నాలుగేళ్ల క్రితం కరీంనగర్ కు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
Also Read : గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామవత్ శంకర్ నాయక్ అకాల మరణం..!
దాంతో పిల్లల్ని భర్తను వదిలేసి వేరే కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే తల్లి చేష్టలను గుర్తించిన కుమారుడు దొరబాబు పద్ధతి మార్చుకోవాలని కోరాడు. అయినా ఉదయశ్రీ వినలేదు. ఈ క్రమంలో ఉదయశ్రీ అతనితో వెళ్లిపోయేందుకు సిద్ధమవుతుండగా గమనించిన కుమారుడు దొరబాబు తల్లిని బెడ్ రూమ్ లోకి పిలిచి వివాహేతర సంబంధం వద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా తల్లి వినకపోవడం తో ఆమె గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి దొరబాబు పరార్ అయ్యాడు. ఈ కేసు విషయంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.









