బాలాపూర్ లడ్డూ తర్వాత.. ఆదిభట్ల వినాయకుడి లడ్డూకు మరో ప్రత్యేకత..!

బాలాపూర్ లడ్డూ తర్వాత.. ఆదిభట్ల వినాయకుడి లడ్డూకు మరో ప్రత్యేకత..!
ఇబ్రహీంపట్నం, మన సాక్షి ప్రతినిధి :
బాలాపూర్ గణేష్ లడ్డుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ తర్వాత ఆదిభట్ల వినాయకుడి లడ్డుకు కూడా మరో ప్రత్యేకత ఉంది. ఆదిబట్ల లో బుర్జు మైసమ్మ దేవాలయం మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో ఆదిభట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ₹21,00,000./- ఇరవై ఒక లక్షల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ వేలంలో మర్రి నిరంజన్ రెడ్డి మరియు కోరే జంగయ్య గారి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది.
చివరికి ₹21 లక్షల భారీ ధరకు మర్రి నిరంజన్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ తర్వాత ఆదిభట్ల వినాయకుడి లడ్డూ వేలం మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గణనాథుడి చల్లని దీవెనలతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుభిక్షంగా ఉండాలని వేడుకున్నానని చెప్పారు.









