Miryalaguda : గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం.. మిర్యాలగూడ సిరిమువ్వ నాట్యలయ చిన్నారులు..!
Miryalaguda : గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం.. మిర్యాలగూడ సిరిమువ్వ నాట్యలయ చిన్నారులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన సిరిమువ్వ నాట్యాలయ చిన్నారులు నృత్యంలో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో 31 మంది చిన్నారులు స్థానం సంపాదించారు.
సిరిమువ్వ నాట్యాలయ గురువు కలకొండ రాము ఆధ్వర్యంలో 2023 డిసెంబర్లో హైదరాబాద్ గచ్చిబౌలిలో కూచిపూడి మహా బృందం నాట్యంలో 4218 మంది నాట్యకారుల ప్రదర్శన లో మిర్యాలగూడకు చెందిన చిన్నారులు ప్రదర్శించగా శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ పరిషత్ లో జరిగిన సభలో ప్రముఖ నాట్య గురువు పసుమర్తి శేషుబాబు వేదాంతం వెంకట శర్మ సీరియల్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి చేతుల మీదుగా చిన్నారులకు మరియు గురువుకు గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్లను అందజేశారు.
అనంతరం నాట్య గురువు కలకొండ రామ్ మాట్లాడుతూ మిర్యాలగూడకు చెందిన చిన్నారులకు గిన్నిస్ వరల్డ్ స్థానం సంపాదించడం చాలా ఆనందకరమైనధని ఇంకా విద్యార్థులు భవిష్యత్తులో ఇంకో ఎన్నో అవార్డులను సాధించే లక్ష్యంగా విద్యార్థులను తయారు చేస్తానని వారు అన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డులు స్థానం సంపాదించిన విద్యార్థులకు మిర్యాలగూడ డివిజన్ డాన్స్ స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అలుగుబెల్లి వెంకట్ చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.
MOST READ :
-
Heart care : మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే… ఇవి తినండి..!
-
Students: భారత్, యూకే విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక ఒప్పందంపై సంతకం..!
-
District collector : మద్యం ప్రియులకు బాడ్ న్యూస్.. నేడు దుకాణాలు బంద్..!
-
PMMY: ఎంఎస్ఎంఈ రంగానికి ఊతం.. ప్రధాన మంత్రి ముద్రా యోజనకు 10 ఏళ్లు పూర్తి..!
-
TG News : తెలంగాణలో పెన్షన్ దారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై పెన్షన్ కోసం నో టెన్షన్..!
-
ACB : కలెక్టరేట్ లో ఏసీబీ దాడి.. లంచం తీసుకుంటూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్..!









