తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : సీఎం రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం నిర్వహించిన గురుకుల విద్యార్థులు..!

Miryalaguda : సీఎం రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం నిర్వహించిన గురుకుల విద్యార్థులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు గురుకుల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచినందుకు గాను కృతజ్ఞతలతో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బిఎల్ఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా నాయకులు, రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా విద్యార్థులు అందరూ కలసి వేడుకలు నిర్వహించుకోవడం అందులో నేను కూడా బాగ స్వామిని కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో సీఎం నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు, మీలాంటి విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచడం, కుల గణన నిర్వహిస్తూ సంపండ వర్గాలకు సంక్షేమం అందించే దిశగా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అని అన్నారు.విద్యార్థులు అందరూ మంచిగా చదువుకొని నేను నా మిర్యాలగూడ అని గర్వంగా చెప్పుకునే విధంగా ప్రతిఒక్కరూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అని అన్నారు.ఆడబిడ్డ చదువులు ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతుందన్నారు.

మన మిర్యాలగూడ భవిషత్తు కాబట్టి ప్రతిఒక్కరూ మంచిగా చదువుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంఈఓ, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు