రూ 3.43 లక్షల విలువ గల గుట్కాలు పట్టివేత

రూ 3.43 లక్షల విలువ గల గుట్కాలు పట్టివేత

కోదాడ రూరల్ జులై 27, మన సాక్షి : : రూ. 3.43 లక్షల విలువగల ల నిషేధిత గుట్కాలు పట్టుకున్న సంఘటన కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్ లో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు చోటుచేసుకుంది.

ALSO READ : BREAKING : దేవరకొండలో రోడ్డు వెడల్పులో షెడ్ల తొలగింపు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  హైదరాబాదు నుండి మచిలీపట్నం వెళ్తున్న కె.వి.ఆర్ ట్రావెల్స్ లో ప్రభుత్వ నిషేధిత గుట్కాలు తరలిస్తున్నారని పక్కా సమారాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. .డ్రైవర్ తోట నాగరాజు క్లీనర్ జ్ఞానేశ్వర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు. శ్రీరామ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారు.