Nalgonda : ప్రభుత్వ ఉచిత పథకాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Nalgonda : ప్రభుత్వ ఉచిత పథకాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
నల్లగొండ , మన సాక్షి
రాజకీయం పార్టీలు ఉచితాలను కట్టడి చేసి యువతకు పని కల్పించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉచితాలు ఇవ్వడం వల్ల ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందన్నారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలు ఇవ్వకుండా కట్టడి చేసే విధంగా సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ , కేంద్ర ప్రభుత్వం, చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల భాష సరిగాలేదని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వారు భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని దాన్ని కట్టడి కి రాజకీయ, నాయకులు, ఉద్యోగులు, భాగస్వామ్యం కావాలన్నారు. ఇంజనీరింగ్ వ్యవస్థలో అవినీతి విపరీతంగా పెరిగిందని అవినీతి కట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.
అవినీతితో భవిష్యత్ తరాలకు ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందన్నారు. బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న వనరుల అనుసంధానం గానే ముందుకు సాగుతుందన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కవితపై వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందిస్తూ పెద్దల సభ గౌరవం తగ్గే విధంగా వ్యవహరించవద్దని హితవు పలికారు.
MOST READ :
-
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. పెరుగుతున్న నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!
-
Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ గురించి మీకు తెలుసా.. ముందే గర్తించడం ఎలా.. జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
-
Suryapet : సూర్యాపేటలో భారీగా.. 18 కిలోల బంగారం దోపిడీ..!
-
TG New : ఆ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!









