Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ గురించి మీకు తెలుసా.. ముందే గర్తించడం ఎలా.. జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..!

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ గురించి మీకు తెలుసా.. ముందే గర్తించడం ఎలా.. జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..!

హైదరాబాద్, మనసాక్షి :

ప్రస్తుత పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ (సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్) అనేది చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యగా పరిణమించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి నలుగురిలో ఒక్కరు తమ జీవితకాలంలో స్ట్రోక్ బారిన పడుతున్నారు. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం ద్వారా స్ట్రోక్‌ను నివారించవచ్చు. కానీ, ఇందుకోసం ప్రజల్లో అవగాహన ఏర్పర్చడం ముఖ్యం.

హైదరాబాదులో ఆదివారం ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పి విజయ, ప్రముఖ న్యూరోలాజిస్టులు డాక్టర్ అరవింద్ శర్మ, డాక్టర్ సలీం ఉప్పల్, సుభాష్ కౌలు, డాక్టర్ కోమల్ కుమార్, డాక్టర్ హరి రాధాకృష్ణ, డాక్టర్ అమిత్ సరాఫ్, డాక్టర్ సౌజన్య వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి?

మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయినా లేక మెదడులోని రక్త నాళం పగిలిపోయినా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల మెదడు కణాలు మరణించి, శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవించవచ్చు.

స్ట్రోక్‌ కు ప్రధాన కారణాలు:

– అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)
– మధుమేహం (రక్తంలో అధిక చక్కెర స్థాయులు)
– పొగ తాగడం, మద్యం సేవించడం
– స్థూలకాయం, అనారోగ్యకరమైన జీవన విధానం

స్ట్రోక్ లక్షణాలను గుర్తించడం

B – Balance (పట్టు): ఒక్కసారిగా మైకం రావడం లేదా పట్టు తప్పి పోవడం
E – Eyes (కళ్లు) : అకస్మాత్తుగా చూపు పోవడం లేదా మసకబారడం
F – Face (ముఖం): ముఖం ఒకవైపునకు జారిపోవడం
A – Arm (చెయ్యి) : అవయవాలు బలహీనపడటం లేదా మొద్దుబారిపోవడం
S – Speech (మాట): మాట్లాడేందుకు కష్టపడటం లేదా మాట అస్పష్టంగా ఉండటం
T – Time (సమయం): తక్షణం ఆస్పత్రికి వెళ్లాలి

తొలి 4, 5 గంటలు చాలా కీలకం. సకాలంలో చికిత్స చేయడం ఎందుకు ముఖ్యం అంటే:

స్ట్రోక్ లక్షణాలను గుర్తించి, 4,5 గంటల్లోపల పేషంటును ఆస్పత్రికి తీసుకెళ్లిన పక్షంలో త్రోమ్‌బోలిసిస్ (thrombolysis) లేదా ఇతరత్రా చికిత్సలతో వారి ప్రాణాలను కాపాడవచ్చు. వైకల్యాన్ని నివారించవచ్చు.

ప్రజలకు విజ్ఞప్తి:

మీ చుట్టూ ఉన్న వారెవరిలోనైనా పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి చేర్చండి. స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీలాంటిది. అలర్టుగా ఉండండి. సకాలంలో గుర్తించండి. ప్రాణాలను కాపాడండి.

MOST READ : 

  1. Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. ఎడమ కాలువకు నీటి విడుదల..!

  2. Miryalaguda : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

  3. TG News : యూరియా, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!

  4. ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!

మరిన్ని వార్తలు