Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsక్రైంజిల్లా వార్తలుటెక్నాలజీహైదరాబాద్

Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!

Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఓ వ్యక్తి గూగుల్ లో సెర్చ్ చేసి స్కామర్లకు చిక్కాడు. దాంతో ఖాతాలో ఉన్న రెండు లక్షలు రూపాయలు పోగొట్టుకున్నాడు. వివరాలు ఏంటంటే..

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలో ఉన్న తన తల్లి చనిపోయింది. అంత్యక్రియలకు వెళ్లేందుకు 11 వేల రూపాయలకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరిన వ్యక్తి ఓ టోల్గేట్ వద్ద డ్రైవర్ కు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయబోయి పొరపాటున టోల్గేట్ క్యూఆర్ కొడ్ కు పంపించాడు.

అయితే వెంటనే అతని కెనరా బ్యాంకు బ్రాంచ్ కు ఫోన్ చేసి చెప్పాడు. కాగా ప్రాసెస్ చేస్తున్నామని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) కి ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే NPCI నెంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేయగా.. అక్కడ స్కామర్ నెంబర్ పెట్టడంతో దానికి ఫోన్ చేశాడు.

ఇతని సమస్యను పూర్తిగా వివరించాడు. పరిష్కరిస్తామని చెప్తూ ముందుగా వెరిఫికేషన్ కోసం ఫోన్ పే ద్వారా తాము చెప్పిన అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలని.. ఆ తర్వాత మొత్తం రిఫండ్ చేస్తామని స్కామర్లు చెప్పారు. స్కామర్ మాటలను పూర్తిగా నమ్మిన అతడు డబ్బులను బదిలీ చేశాడు.

కానీ అమౌంట్ హోల్డ్ లో పడిందని.. మరికొన్ని డబ్బులు పంపించాలని తెలపడంతో బాధితుడి ఎకౌంట్లో డబ్బులు లేవన్నాడు. తన కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకొని దాని ద్వారా బదిలీ చేయాలని స్కామర్లు కోరారు. అయితే అతడు అలాగే చేశాడు.

ఇలా ఏటీఎం కార్డు డీటెయిల్స్ స్కామర్లు తీసుకొని ఓటీపీ వివరాలతో స్కామర్లు మొత్తం 2,28,334 రూపాయలను కాజేశారు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

MOST READ :

  1. Miryalaguda : ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు.. విచారణ జరపి చర్యలు తీసుకోవాలి..!

  2. Rajiv Yuva Vikas : రాజీవ్ యువ వికాసం.. ముందుగా వారికి 4 లక్షలు, ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు..!

  3. గంజాయి మత్తులో యువత.. అమ్మేవారి సమాచారం ఇస్తే గోప్యం..! 

  4. Rythu Bharosa : రైతు భరోసా అందని రైతులకు స్పష్టత.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Loans : కొత్త రకం రుణాలను ప్రవేశపెట్టిన పూనావాలా ఫిన్‌కార్ప్..!

మరిన్ని వార్తలు