TG News : రోడ్డు పక్కన కుప్పలుగా కరెన్సీ నోట్లు, దొరికినన్ని ఏరుకున్నారు.. అంత డబ్బు ఎక్కడిదంటే..!
TG News : రోడ్డు పక్కన కుప్పలుగా కరెన్సీ నోట్లు, దొరికినన్ని ఏరుకున్నారు.. అంత డబ్బు ఎక్కడిదంటే..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
రోడ్డు పక్కన కరెన్సీ నోట్లు కనిపిస్తే ఎవరు ఊరుకుంటారు. వాహనాలపై వెళ్తున్న వారు సైతం ఆగి మరి ఎగబడి చేరుకున్నారు. అది ఎక్కడో కాదు తెలంగాణలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది.
అదెక్కడో ఏంటో ఆ కథ తెలుసుకుందాం.. రోడ్డు పక్కన నోట్ల కట్టలు కుప్పలుగా పడి ఉంటే ఎంతో సంతోషంగా చేరుకుంటారు. అలాంటి సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్సాంపూర్ గ్రామ శివారులో రోడ్డు పక్కన 100 , 500 రూపాయల నోట్లు చెట్ల కింద కుప్పలు తెప్పలుగా ఆకులు రాలినట్లుగా పడి ఉన్నాయి. రోడ్డు పక్కన వెళ్తున్న ప్రయాణికులు ఎగబడి మరీ ఏరుకున్నారు. నోట్లు ఏరుకుంటూ చాలా సంతోషంగా పంట పండిందని జేబులు నింపుకున్నారు.
అది చూసిన రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు సైతం వాహనాలు ఆపి కుప్పలు తెప్పలుగా ఉన్న నోట్లన్నీ జేబులు నింపుకొని వెళ్లారు. అయితే తీరా నోట్లు ఏరుకొని వెళ్లిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
అదంతా దొంగ నోట్లు అని తేలింది. వారి ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. అయితే అంత కుప్పలుగా నకిలీ నోట్లు అక్కడ ఎవరు పడేశారు..? దొంగ నోట్ల వ్యాపారం ఈ ఏరియాలో జరుగుతుందా.? అనేది తెలియాల్సి ఉంది.
LATEST UPDATE :
-
Students : కేజీబీవీ పాఠశాలలో 53 మంది బాలికలకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు.. మంత్రి, కలెక్టర్ పరమార్శ..!
-
Gold Price : తెలుగింటి మహిళలకు శుభవార్త.. రూ.4900 తగ్గిన బంగారం ధర..!
-
Hyderabad : చికెన్ మోమోస్ తిని 50 మందికి అస్వస్థత.. ఒకరి మృతి..!
-
Hyderabad : కేటీఆర్ బావమరిది జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..!









