Srisailam : శ్రీశైలంకు పెరిగిన భారీ వరద తాకిడి.. మరో రెండు గేట్లు ఓపెన్.. సాగర్ వైపు ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. Latest Update
Srisailam : శ్రీశైలంకు పెరిగిన భారీ వరద తాకిడి.. మరో రెండు గేట్లు ఓపెన్.. సాగర్ వైపు ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. Latest Update
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి భారీ వరద ప్రవాహం రావడంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి జరిగింది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు మంగళవారం మరో రెండు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ఐదు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా 4,42, 441 క్యూసెక్కుల వరద రావడంతో ఐదు ఐదు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కుడి ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి తో పాటు ఐదు గేట్ల ద్వారా 1,95,457 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాగా శ్రీశైలం జలాశయానికి 4,42,441 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయంలో 885 అడుగుల నీటిని సామర్థ్యానికి గాను ప్రస్తుతం 882.50 అడుగుల మేర నీరు ఉంది.
పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను 201. 58 టీఎంసీల నీరు ఉంది జలషానికి ఇన్ ఫ్లో పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అవసరమైతే మరో రెండు గేట్లను ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీశైలం జలాశం ఐదు గేట్లను ఎత్తడం ద్వారా పర్యాటకులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
Nagarjunasagar : సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు.. ఇన్ ఫ్లో 1.44 లక్షల క్యూసెక్కులు.. Latest Update
WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!
క్యూసెక్కులు అంటే ఏమిటి.. నీటి ప్రవాహాన్ని అలా ఎందుకు కొలుస్తారు..!









