Heavy Rain : ప్రమాద స్థాయిలో కప్పలవాగు ప్రవాహం.. భీంగల్ లో భారీ వరద ఉధృతి..!
Heavy Rain : ప్రమాద స్థాయిలో కప్పలవాగు ప్రవాహం.. భీంగల్ లో భారీ వరద ఉధృతి..!
భీంగల్, మన సాక్షి :
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా పలు గ్రామాల్లోని చెరువులు కట్టలు తెగిపోతున్నాయి. దీంతో భీంగల్ లో వరద ఉధృతంగా దిగువకు ప్రవహిస్తుండడంతో ఎక్కడికక్కడ
రహదారులు కూడా తెగిపోయాయి.
రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భీంగల్, బడా భీంగల్ మార్గంలో కప్పల వాగు ప్రమాద భరితంగా ప్రవహిస్తోంది. భీంగల్ బడా భీంగల్ మధ్య రాకపోకలు ఆగిపోయాయి. పంట పొలాలన్నీ చెరువులు తలపిస్తున్నాయి. శివారులోని పెదంగంటి ఎల్లమ్మ పుణ్యక్షేత్రం పూర్తిగా ముంపునకు గురైంది.
అలాగే భీంగల్ మండలం లో ఎక్సైజ్ కార్యాలయం చుట్టూ వరద చుట్టూ ముట్టింది కార్యాలయం లో ఉన్నటువంటి ఇద్దరు ఉద్యోగస్తులను, స్థానికులు, పోలీసులు,అధికారులు, వారిని తాడు సహాయంతో కాపాడారు.ఎవరు కూడా చేపల వేటకు ప్రాజెక్టులు, చెరువులు, నదులలోకి వెళ్లకుండా కట్టడి చేయాలని అధికారులు తెలియజేశారు..
నీటి ప్రవాహం కొనసాగుతున్న దృష్ట నీటి ప్రవాహం ఉదృతంగా ఉంటుంది.ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నీటి ప్రవాహాని అంచనా వేయకుండా స్నానాలు చేయడానికి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయవద్దన్నారు. వరద నీటి ఉధృతిని అంచనా వేయకుండా నదులు, కాలువలు,కుంటలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. విద్యుత్ స్తంభాల సమీపంలోకి వెళ్లవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు.
MOST READ :
-
Horticulture : రైతులకు భారీ శుభవార్త.. వారికి ఎకరానికి రూ.8వేలు సబ్సిడీ..!
-
Nacharam : ముంబై నుండి తెప్పించిన సిద్ధి వినాయకుడి విగ్రహం.. ఘనంగా పూజలు..!
-
Kamareddy : జల దిగ్బంధంలో కామారెడ్డి.. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరదలో కొట్టుకపోయిన కార్లు.. (వీడియో)
-
Miryalaguda : జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి మీరు అర్హులైతే.. వెంటనే ధరఖాస్తు చేసుకోవాలి..!
-
Narayanpet : ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ..!









